కోలీవుడ్‌లో శ్రీరెడ్డికి ఇబ్బందులు తప్పవా?

కోలీవుడ్‌లో శ్రీరెడ్డికి ఇబ్బందులు తప్పవా?

నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలతో టాలీవుడ్‌లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఆమె కోలీవుడ్ నటులపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే... అక్కడ ఆమెకు భిన్నమైన పరిస్థితి ఎదురవుతోంది. ఆమె వ్యభిచారం చేస్తోందంటూ తిరిగి కేసు పెట్టడంతో ఇరకాటంలో పడిందని చెబుతున్నారు.

ఇటీవల శ్రీరెడ్డి సంచలన ఆరోపణలో మరోమారు వివాదానికి తెరలేపింది. ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్, సుందర్‌.సి, నటుడు రాఘవ లారెన్స్, శ్రీకాంత్‌ (తెలుగులో శ్రీరామ్‌) తదితరులపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. నడిగర్‌ సంఘం కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ  హెచ్చరించినా ఆమె తన ఆరోపణలపై తగ్గలేదు. చెన్నైలో మకాం వేసి మరీ తీవ్ర ఆరోపణలు చేస్తుండడంతో కోలీవుడ్ మండిపడుతోంది.

దీంతో శ్రీరెడ్డిపై కోలీవుడ్ నటుడు వారాహి చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తెలుగు చిత్రపరిశ్రమలోని పలువురు ప్రముఖులపై శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి డబ్బులు వసూలు చేస్తోందని ఫిర్యాదులో ఆరోపించారు. ఇప్పుడు టాలీవుడ్‌ను వదిలేసి కోలీవుడ్‌పై పడిందని ఆరోపించారు. వ్యభిచారాన్ని అంగీకరించిన ఆమెను అదే కేసులో అరెస్ట్ చేయాలని వారాహి తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు