పవన్ మాజీ వైఫ్‌ తిరిగొస్తోంది

పవన్ మాజీ వైఫ్‌ తిరిగొస్తోంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ కెరీర్ స్టార్ట్ చేసింది నటనతోనే. బద్రి - జానీ సినిమాల్లో అతడితో కలిసి నటించింది. అదే టైంలో వాళ్లిద్దరూ ప్రేమలో పడటం.. కొన్నాళ్లకు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తరవాత కొద్దికాలానికే వాళ్లిద్దరూ విడిపోయారు. విడిపోయిన తరవాత తన ఇద్దరి పిల్లలతో రేణు దేశాయ్ సింగిల్ గానే బతుకుతూ వచ్చింది. ఈమధ్యనే మనసుకు నచ్చిన వ్యక్తి దొరకడంతో రెండో పెళ్లికి రెడీ అయింది.

పవన్ కు దూరమైన తరవాత రేణు దేశాయ్ కు ఇండస్ట్రీ నుంచి అడపాదడపా ఆఫర్లు వస్తూనే వచ్చాయి. వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించి ఫుల్ టైం పిల్లల పెంపకానికి కేటాయించింది. మళ్లీ ఇప్పుడు తిరిగి నటించడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. కాబోయే భర్త నుంచి కూడా ఇందుకు ప్రోత్సాహం ఉండటంతో నటనాపరంగా గుర్తింపు ఉండే పాత్రలు చేయాలని అనుకుంటోందని ఇండస్ట్రీలోని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలో ఆమె నటించే సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

రేణు దేశాయ్ కేవలం నటి మాత్రమే కాదు. ఆమె మంచి రైటర్ కూడా. ఓ మరాఠీ సినిమా డైరెక్ట్ కూడా చేసింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీంలో మెంబర్ గా కూడా పనిచేసింది. ఈమధ్యనే ఓ టీవీ షోలో జడ్జిగా వ్యవహరించింది. పవన్ సినిమాలకు బైబై చెప్పేసి పాలిటిక్స్ లో బిజీ అయిపోయిన తరుణంలో ఎప్పుడో సినిమాలకు బైబై చెప్పిన రేణు తిరిగి సినిమాలు చేయడానికి రెడీ అవుతుండటం విశేషమనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు