అమర్ అక్బర్ కు కాసుల కష్టాలు

అమర్ అక్బర్ కు కాసుల కష్టాలు

మాస్ మహారాజా రవితేజ సినిమాలంటే ఒకప్పుడు మినిమం గ్యారంటీలా ఉండేవి. మూస కథలు.. రొటీన్ ఎంటర్ టెయిన్ మెంట్ రవితేజ సినిమాలకు మైనస్ పాయింట్ గా మారింది. అందుకే అతడి లేటెస్ట్ సినిమాలు నేలటిక్కెట్టు.. టచ్ చేసి చూడు బాక్సాఫీసును ఏమాత్రం మెప్పించలేక పోయాయి. ఇలాంటి టైంలో కెరీర్ మొదట్లో తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీను వైట్లతో రవితేజ సినిమా చేస్తున్నాడు.

రవితేజ - శ్రీనువైట కాంబినేషన్ లో అమర్ అక్బర్ ఆంటోని పేరుతో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ సినిమాను శ్రీను వైట్ల్ ఓ రేంజిలో తీద్దామని అనుకున్నా బడ్జెట్ పరిమితులు అడ్డం పడుతున్నాయట. రీసెంట్ గా అమర్ అక్బర్ ఆంటోని యూనిట్ ఓ షెడ్యూల్ కోసం అమెరికాకు వెళ్లొచ్చింది. అసలు అక్కడ రెండు షెడ్యూళ్లు తీయాలన్నది డైరెక్టర్ శ్రీను వైట్ల ఐడియా అని తెలుస్తోంది. కానీ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి బడ్జెట్ లిమిటేషన్ పై స్పష్టమైన గైడ్ లైన్స్ ఉండటంతో ఒక్క షెడ్యూల్ తో సరిపెట్టేశాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

అమెరికాలో తీయాలని అనుకున్న సీన్లన్నీ ప్రస్తుతం స్పెషల్ అరేంజ్ మెంట్లు చేసుకుని హైదరాబాద్ లోనే తీస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో ఇలియానా తిరిగి టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఇంతవరకు రవితేజ - ఇలియానా కాంబినేషన్ లో కిక్  దేవుడు చేసిన మనుషులు ఖతర్నాక్ సినిమాలు వచ్చాయి. అమర్ అక్బర్ ఆంటోని నాలుగోది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు