కామన్ మేన్ కు సపోర్ట్ దక్కుతుందా?

కామన్ మేన్ కు సపోర్ట్ దక్కుతుందా?

అప్పుడప్పుడు కాస్త నీరసంగా సాగినా మొత్తంమీద బిగ్ బాస్ సీజన్-2 క్రమేపీ రసవత్తరంగా మారుతోంది. వారాలు గడుస్తున్న కొద్దీ బిగ్ బాస్ హౌజ్ నుంచి ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతుండటంతో షో ఇంట్రస్టింగ్ గా మారుతోంది. వచ్చేవారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే అంశం వీకెండ్ ముందు ఆడియన్స్ లో ఇంట్రస్ట్ పెంచుతోంది.

ఇలాంటి టైంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు ఓ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ షో నుంచి ఇప్పటివరకు ఎలిమినేట్ అయినవారిలో ఒకరిని ఆడియన్స్ ఛాయిస్ ప్రకారం తిరిగి షోకు తీసుకువస్తామని ప్రకటించారు. దీంతో ఆడియన్స్ ఎవరికి మొగ్గు చూపుతారనేది  ఇంటస్ట్రింగ్ గా మారింది. ఇప్పటివరకు షోలో పాల్గొన్న వాళ్ల నుంచి సంజన - నూతన్ నాయుడు - కిరీటీ దామరాజు - శ్యామల - భానుశ్రీ - తేజస్వి మాదివాడ ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయారు.

వీళ్లలో కామన్ మేన్ కోటాలో షోలో అవకాశం దక్కించుకున్న నూతన్ నాయుడుకు నెటిజన్ల నుంచి ఎక్కువ సపోర్ట్ వస్తోంది. అతడు కూడా సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాను రెండోవారంలోనే బయటకు వచ్చేయాల్సి రావడం వల్ల అందరినీ పెద్దగా ఎంటర్ టెయిన్ చేయలేకపోయానని.. ఈసారి ఛాన్సిస్తే తనేంటే నిరూపించుకుంటానని అంటున్నాడు. ఆడియన్స్ మరి ఎవరివైపు మొగ్గు చూపుతారో.. ఎవరికి రీ ఎంట్రన్స్ ఛాన్స్ ఇస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు