ఈ రేంజ్ అంత ఈజీయేం కాదు

ఈ రేంజ్ అంత ఈజీయేం కాదు

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో చేసినవి తక్కువ సినిమాలే అయినా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలే ఎక్కువ. ప్రొడ్యూసర్ బెల్లంకొండ శ్రీనివాస్ తనయుడనే గుర్తింపుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అతడి మొదటి సినిమా అల్లుడు శీను భారీ బడ్జెట్ తో తీశారు.  ఆ సినిమాకు అదే ప్లస్ పాయింటయింది. తరవాత అతడి కెరీర్ లో స్పీడున్నోడు మినహా అన్నీ అదే స్టయిల్ లో వచ్చాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా శ్రీవాస్ డైరెక్షన్ లో సాక్ష్యం సినిమా చేశాడు. ఈమూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు కూడా శ్రీనివాస్ మార్కెట్ రేంజ్ కు మించే ఖర్చు చేశారు. తనను చూసి ఇండస్ట్రీలో చాలామంది జెలసీ ఫీలవుతున్నారనే విషయం తనకు తెలుసని అంటున్నాడు శ్రీనివాస్. కానీ ఈ రేంజికి రావడం వెనుక ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేశానని చెబుతున్నాడు. ‘‘నేను పుట్టి పెరిగిందంతా ఇండస్ట్రీలోనే. సినిమాలు చూస్తూనే పెరిగా. సినిమా హీరోని అవ్వాలని అనుకున్నాక ఎంతో కష్టపడ్డా. ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడిపా. ఈ రేంజ్ అంత ఈజీగా ఏమీ రాలేదు’’ అంటూ తన మనసులోని మాట చెప్పుకొచ్చాడు.

సాక్ష్యం సినిమా పంచభూతాల ఎలిమెంట్ తో వస్తోంది. ఇటువంటి సబ్జెక్ట్ ఇంతవరకు తెలుగులో రాలేదని.. డైరెక్టర్ ఈ స్టోరీ చెప్పగానే చాలా ఎగ్జయిట్ అయ్యాయని.. ఈ సినిమా కోసం 160 రోజులకు పైగా కష్టపడి పనిచేశామని అంటున్నాడు శ్రీనివాస్. దువ్వాడ జగన్నాథమ్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన పూజా హెగ్డే మళ్లీ ఈ సినిమాలో హీరోయిన్ గా మెరుపులు మెరిపించనుంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు