కాజల్ క్లియర్ గా చెప్పేసింది

కాజల్ క్లియర్ గా చెప్పేసింది

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లవుతోంది. తెలుగు - తమిళం భాషల్లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగి పెద్ద స్టార్లందరి పక్కన ఆడిపాడింది. ఆమె తో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామల్లో చాలామంది ఇప్పటికే తెరమరుగైపోయారు. గ్లామర్ రోల్స్ ఇప్పటికి సూటయ్యే అందం కావడంతో ఇంకా కాజల్ డెయిరీ బిజీగానే ఉంది.  

అందుకేనేమో ఇప్పటికి హీరోయిన్ పాత్రలయితే చేస్తానని అంటోంది. జనతా గ్యారేజ్ లో నేను పక్కా లోకల్ అంటూ ఐటం సాంగులో అదరగొట్టింది. ఆ తరవాత ఆమెకు మరికొన్ని సినిమాల్లోనూ ఐటం సాంగ్స్ ఆఫర్లొచ్చాయి. తాజాగా ఓ పెద్ద డైరెక్టర్ తను భారీ బడ్జెట్ తో తీస్తున్న మూవీలో కాజల్ తో ఐటం సాంగ్ చేయిద్దామని ప్రయత్నించాడు. ఇందుకోసం భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. కానీ ఈ విషయంలో కాజల్ క్లారిటీగానే ఉంది. ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్రలు తప్ప ఐటం సాంగులు చేయబోనని తేల్చిచెప్పేసిందిట.

ప్రస్తుతం కాజల్ కెరీర్ లో తొలిసారి లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన సూపర్ హిట్ మూవీ క్వీన్ రీమేక్ తమిళ వెర్షన్ లో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. దీంతోపాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కే సినిమాలో టాలీవుడ్ చందమామకు ఛాన్స్ దక్కింది. ఐటం సాంగ్స్ చేస్తే హీరోయిన్ గా దారులు మూసుకుపోతాయని కాజల్ ఫీలవుతున్నట్టుంది. ఈ లెక్కన ఆ లక్కీ ఛాన్స్ జనతా గ్యారేజ్ కే స్పెషల్ అనుకోవాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు