సాయి పల్లవి పడేసింది, రాశి లేపుతోంది

సాయి పల్లవి పడేసింది, రాశి లేపుతోంది

'నాకేదైనా నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా' అంటూ ఖైదీ నంబర్‌ 150లో చిరంజీవిలా వ్యవహరిస్తుంటుంది సాయి పల్లవి. విపరీతమైన క్రేజ్‌ వున్న సాయి పల్లవి డేట్లు సాధించడం అంత తేలిక కాదు. ఏ కథ అయినా తనకి నచ్చకపోతే ఎవరిది, ఏమిటని చూడకుండా రిజెక్ట్‌ చేసేసే సాయి పల్లవి 'శ్రీనివాస కళ్యాణం'ని కూడా అలాగే రిజెక్ట్‌ చేసింది.

ఆమె డేట్స్‌ సాధించాలని దిల్‌ రాజు ఎంత ట్రై చేసినా కానీ ఆమె కథ నచ్చలేదని, ముఖ్యంగా తన క్యారెక్టర్‌ ఎక్సయిటింగ్‌గా లేదని తప్పుకుంది. దాంతో రాశి ఖన్నాని కథానాయికగా ఎంచుకున్నారు. ఈ క్యారెక్టర్‌ రిజెక్ట్‌ చేయడం పట్ల రిగ్రెట్సే లేవని సాయి పల్లవి మీడియాతోను చెప్పింది. కానీ రాశి ఖన్నా మాత్రం ఈ క్యారెక్టర్‌ చేయడం జన్మజన్మల అదృష్టమనే రేంజిలో లేపుతోంది. ఈ కథ చెప్పగానే ఇంత మంచి సినిమాలో ఇంత మంచి పాత్ర చేస్తున్నందుకు తన తల్లి ఏడ్చేసారని కూడా చెప్పుకొచ్చింది.

మరి అంత బాగున్న పాత్రని సాయి పల్లవి అంత ఈజీగా వదిలేసుకుందా? అదీ ఫిదా, ఎంసిఏ చిత్రాలను తనతో వరుసగా తీసిన నిర్మాత ఆఫర్‌ చేసినా కూడా? ఇంతకీ ఈ ఇద్దరు తారల్లో ఎవరి తీర్పు రైట్‌ అనేది ఆగస్టు 9 తర్వాతే తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు