దిల్‌ రాజుని భయపెడుతోన్న సినిమా

దిల్‌ రాజుని భయపెడుతోన్న సినిమా

సాధారణంగా తన సినిమాలకి ఎంత పెద్ద హీరోల సినిమాలు పోటీకి వచ్చినా భయపడని దిల్‌ రాజు ఈసారి మాత్రం ఒక మీడియం రేంజ్‌ సినిమాకి భయపడుతున్నాడు. నితిన్‌తో తాను తీసిన శ్రీనివాస కళ్యాణం వచ్చిన ఆరు రోజులకి విడుదల కాబోతున్న విజయ్‌ దేవరకొండ చిత్రం 'గీత గోవిందం' డ్యామేజ్‌ చేస్తుందనేది దిల్‌ రాజు భయమట.

ఈ చిత్రాల ప్రమోషన్స్‌లో కూడా 'గీత గోవిందం' ఎక్కువగా యూత్‌ని ఆకర్షిస్తోంటే, శ్రీనివాస కళ్యాణం దాని ముందు నిలబడలేకపోతోంది. ఈ కారణంగానే శ్రీనివాస కళ్యాణం టీజర్‌లో ఫ్యామిలీ దృశ్యాలు లేకుండా యూత్‌ని ఆకట్టుకోవడానికి లవ్‌ సీన్లు పెట్టారట. గీత గోవిందం నుంచి యూత్‌ దృష్టిని తిప్పుకోవడానికే దిల్‌ రాజు ఇలా చేసినట్టు టాక్‌. ఇదిలావుంటే తమ సినిమా టీజర్‌ కోసం గీత గోవిందం టీజర్‌ రిలీజ్‌ ఒక రోజు వాయిదా వేసుకోమని రాజు రిక్వెస్ట్‌ చేసాడు. ఈ సంగతిని సదరు నిర్మాతలు పోస్టర్‌పై ముద్రించి మరీ లీక్‌ చేసేసారు.

బొమ్మరిల్లు రేంజ్‌ హిట్‌ అవుతుందని దిల్‌ రాజుకి నమ్మకాలున్న శ్రీనివాస కళ్యాణంకి వారం తిరగకుండా తలనొప్పిగా మారేలా వున్న గీత గోవిందం ఎఫెక్ట్‌ని మినిమైజ్‌ చేయడానికి దిల్‌ రాజు గట్టిగా కృషి చేస్తున్నాడు. అయితే యూత్‌ పిచ్చెత్తి పోతోన్న రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండనుంచి అటెన్షన్‌ డైవర్ట్‌ చేయడమంటే ఆషామాషీ యవ్వారం కానే కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు