ఎన్టీఆర్‌కి ముప్పు జరిగింది అక్కడే!

ఎన్టీఆర్‌కి ముప్పు జరిగింది అక్కడే!

'అరవింద సమేత' చిత్రంలోని ఒక కీలక దృశ్యంలోని ఫోటో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడంతో మొత్తం యూనిట్‌కే షాక్‌ తగిలింది. ఆన్‌ లొకేషన్‌ స్టిల్స్‌ లీకవడం మామూలే అయినా కానీ ఇలా కీలకమైన ఎమోషనల్‌ సన్నివేశంలోని దృశ్యాలు అంత ఈజీగా బయటకి రావు. దీంతో ఈ లీక్‌ ఎలా జరిగిందనేది చాలా సీరియస్‌గా తీసుకున్నారు.

ఆ లీక్‌ అయిన ఫోటోని చూస్తే క్లియర్‌గా మానిటర్‌లో వీడియో చూస్తూ తీసిన ఫోటోలా వుంది. ఆ యాక్సెస్‌ వున్నది కేవలం ఎడిటింగ్‌ టీమ్‌కే కావడంతో వారందరినీ సీరియస్‌గా ఇంటరాగేట్‌ చేస్తున్నారు. స్నాప్‌షాట్‌ లీక్‌ అయిందంటే ఖచ్చితంగా ఆ సీన్‌ వీడియో కూడా తీసి వుంటారనేది నిర్మాత, దర్శకుల భయం. ఆ వీడియో బయటకి రాకుండా ఆపి డ్యామేజ్‌ నివారించాలని ఇప్పుడు ఇంటి దొంగ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

అసలే త్రివిక్రమ్‌ సినిమా అత్తారింటికి దారేది ఫస్ట్‌ హాఫ్‌ మొత్తం లీక్‌ అయిపోయి ఎంత సంచలనమైందో తెలిసిందే. ఈ ఉదంతంతో మళ్లీ అప్పటి పీడకలలు గుర్తు రావడంతో వెంటనే కఠిన చర్యలకి సిద్ధమవుతున్నారు. వంద కోట్ల బిజినెస్‌ ఆధారపడి వున్న సినిమాకి ఎలాంటి ఛాన్స్‌ తీసుకోలేరు కనుక దొంగ కోసం జల్లెడ పడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు