తరుణ్‌, వరుణ్‌లా గాయబ్‌ అవుతాడా?

తరుణ్‌, వరుణ్‌లా గాయబ్‌ అవుతాడా?

కొందరు యువ హీరోలు వచ్చిన కొత్తల్లో బ్లాక్‌బస్టర్లు సాధించి, ఆ తర్వాత అదే ఊపులో ఒక పది సినిమాలు చేసేసి, ఆ తర్వాత ఫ్లాపులతో క్రేజ్‌ కోల్పోయి క్రమేపీ కనిపించకుండా పోవడం చాలా సార్లు జరుగుతుంది. తరుణ్‌, ఉదయ్‌ కిరణ్‌, వరుణ్‌ సందేశ్‌, సిద్ధార్థ్‌... ఇలా ఈ జాబితా చూస్తే చాలా పెద్దదే వుంది. తాజాగా ఈ కోవలోకి చేరిపోయే ప్రమాదంలో పడ్డాడు రాజ్‌ తరుణ్‌. హీరోగా పరిచయమైన కొత్తలో వరుస విజయాలు అందుకున్న రాజ్‌ తరుణ్‌కి ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్‌ తదితర బ్లాక్‌బస్టర్‌ సినిమాలున్నాయి.

కానీ ఇటీవల అతనికి అదృష్టం కలిసి రావడం లేదు. ఏవో చిన్నా చితకా సినిమాలు చేస్తే జనం పట్టించుకోవడం లేదంటే అనుకోవచ్చు. నాగార్జున నిర్మించిన రంగుల రాట్నం, దిల్‌ రాజు నిర్మించిన లవర్‌ చిత్రాలకి నామమాత్రపు వసూళ్లు కూడా రాకపోవడంతో రాజ్‌ తరుణ్‌ కెరియర్‌కి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే అవకాశాలు తగ్గిపోగా, పెద్ద బ్యానర్ల సినిమాలే డిజాస్టర్స్‌ అయ్యాక ఇక చిన్న నిర్మాతలు తనతో సినిమా తీసేందుకు సాహసించకపోవచ్చు. ఏదో ఒకలా ఒక మంచి కథని పట్టి తిరిగి ఫామ్‌లోకి రాకపోతే మాత్రం అసలే పోటీ ఎక్కువగా వున్న హీరోల మధ్య రాజ్‌ తరుణ్‌ ఎక్కువ కాలం నిలబడలేడని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు