ఒకే రోజు చిరు-చరణ్ ధమాకా

ఒకే రోజు చిరు-చరణ్ ధమాకా

ఆగస్టు 22.. మెగా అభిమానులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఆ రోజు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు సంబంధించి అభిమానులకు ఏదో ఒక కానుక ఇవ్వడం రివాజు. ఈ ఏడాది చిరు పుట్టిన రోజుకు మరింత ప్రత్యేకమైన కానుక ఉంటుందని భావిస్తున్నాడు. స్వయంగా ఇప్పుడు చిరంజీవే ఓ సినిమా చేస్తుండటంతో దాని ఫస్ట్ లుక్ టీజర్ లాంచ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చిరు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర గత ఏడాది చివర్లోనే మొదలైంది. ఐతే ఇప్పటిదాకా సినిమాకు సంబంధించి అధికారికంగా ఏ విశేషాలూ పంచుకోలేదు. అమితాబ్ బచ్చన్ మాత్రం ఆన్ లొకేషన్ పిక్స్ రెండు షేర్ చేశాడు. ఫస్ట్ లుక్ కూడా ఇంకా లాంచ్ అవ్వలేదు.

ఐతే చిరు పుట్టిన రోజు కానుకగా నేరుగా ఫస్ట్ టీజర్ లాంచ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం కొన్ని రోజుల కిందట్నుంచే పని కూడా మొదలైనట్లు సమాచారం. ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్ర బృందం.. టీజర్‌ను కూడా భారీ స్థాయిలోనే తీర్చిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఐతే చిరు పుట్టిన రోజుకు మెగా అభిమానులకు ఇదొక్కటే కానుక కాదట. చిరు తనయుడు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ కూడా అదే రోజు లాంచ్ చేస్తారట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి స్టయిల్లో మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం పవర్ ఫుల్ మాస్ ఫస్ట్ లుక్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఆగస్టు 22న మెగా అభిమానులకు డబుల్ ధమాకా వినోదం గ్యారెంటీ అన్నమాటే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English