నితిన్ విమర్శకులకు ఇచ్చాడు పంచ్

నితిన్ విమర్శకులకు ఇచ్చాడు పంచ్

యువ కథానాయకుడు నితిన్ వేదికలెక్కినపుడు నెమ్మదిగా మాట్లాడలేడు. బ్రేకుల్లేకుండా సాగిపోతుంటుంది అతడి ప్రసంగం. అక్కడక్కడా కొంచెం మాట కూడా తడబడుతుంది. దీనిపై ఇండస్ట్రీలో కొందరు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఒక సందర్భంలో అతడి పేరు పెట్టకుండా ఈ బలహీనత మీద ఒక వెబ్ సైట్లో చీప్ ఆర్టికల్ ఒకటి వచ్చింది. దానిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఒకరి బలహీనతను వైకల్యం లాగా చూపించి వార్త రాయడంపై సోషల్ మీడియాలో జనాలు తిట్టిపోశారు. ఐతే ఇండస్ట్రీ జనాలకు కూడా ఇలా ఎవరి లోపాలైనా ఎత్తి చూపించి దాని మీద మాట్లాడుకోవడం సరదా. ఈ విషయమై ‘శ్రీనివాస కళ్యాణం’ ఆడియో వేడుకలో దర్శకుడు సతీశ్ వేగేశ్న నితిన్ విమర్శకులకు గట్టి పంచే ఇచ్చాడు.

తాను ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాను నితిన్‌తో చేయబోతున్నట్లు తెలిశాక.. కొందరు సందేహాలు వ్యక్తం చేశారని.. ఇందులో పెళ్లి, మంత్రాలకు సంబంధించిన డైలాగులు నితిన్ సరిగా పలకలడో లేదో చూసుకోమని అన్నారని సతీశ్ చెప్పాడు. ఐతే తానా మాటల్ని పట్టించుకోలేదని.. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఐదు నిమిషాల సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో అద్భుతంగా చేశాడని.. డైలాగులు కూడా చాలా బాగా చెప్పాడని.. ఆ రోజు మొత్తం యూనిట్ సభ్యులంతా లేచి నిలబడి చప్పట్లతో అభినందించారని సతీశ్ తెలిపాడు.

ఈ రకంగా నితిన్ మాట తడబాటు గురించి సెటైర్లు వేసేవాళ్లకు సతీశ్ గట్టిగానే బుద్ధి చెప్పాడు సతీశ్. ఇక ‘శ్రీనివాస కళ్యాణం’ కథను నితిన్‌కు చెప్పినపుడు చాలా బాగుంది అని.. తనకు బై చెప్పేసి వెళ్లిపోబోయాడని.. ఐతే అతను సినిమా చేస్తున్నాడా లేదా అన్నది తనకు అర్థం కాలేదని.. ఈ విషయం అడిగితే... అవునా ఆ విషయం చెప్పలేదా అంటూ నవ్వేసి తాను ఈ సినిమా చేస్తానని అన్నాడని సతీశ్ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు