బిగ్ ఆఫ‌ర్.. ఎలిమినేట్ అయినోళ్ల‌ను తిరిగి పంపే చాన్స్

బిగ్ ఆఫ‌ర్.. ఎలిమినేట్ అయినోళ్ల‌ను తిరిగి పంపే చాన్స్

ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్న ట్యాగ్ లైన్ తో బిగ్ బాస్ 2 సీజిన్ స్టార్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. అనుకున్న‌ట్లే ర‌క‌ర‌కాల ట్విస్టుల‌తో వెళుతున్న ఈ షోలో మ‌రో ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ప్రేక్ష‌కుల ఓట్ల‌తో హౌస్ లో ఉన్న వారిని సేవ్ చేసే అవ‌కాశం క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే.

ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఇప్ప‌టికే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారిని తిరిగి హౌస్ లోకి పంపే అద్భుత‌మైన ఆఫ‌ర్ ను ప్రేక్ష‌కుల ముంఉ పెట్టారు. అయితే.. ఇందుకు చేయాల్సింది ఇప్ప‌టికే హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన వారిలో ఎవ‌రికైతే ఎక్కువ ఓట్లు ల‌భిస్తాయో వారిని మ‌ళ్లీ మ‌రోసారి హౌస్ లోకి పంప‌నున్నారు.

మొద‌ట్నించి చెబుతున్న‌ట్లుగా ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్న మాట‌కు త‌గ్గ‌ట్లే బిగ్ బాస్ ఈసారి తీసుకున్న నిర్ణ‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌రి.. ఈసారి హౌస్ లోకి వెళ్లేది ఎవ‌రు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే ఎలిమినేట్ అయిన వారి జాబితాను చూస్తే.. సంజ‌నా.. నూత‌న‌నాయుడు.. కిరిటీ.. శ్యామ‌ల‌.. భానుశ్రీ‌.. తేజ‌స్వీ ఉన్నారు. మ‌రి.. ప్రేక్ష‌కులు ఎవ‌రికి ఓట్లు వేస్తారో చూడాలి. ఇదిలా ఉంటే.. ఇదంతా కూడా తేజ‌స్విని మ‌ళ్లీ హౌస్ లోకి పంపేందుకే ఇలాంటి నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని చెబుతున్నారు. మ‌రి.. ఈ వాద‌న‌లో ఎంత నిజం ఉంద‌న్న విష‌యం తుది నిర్ణ‌యంతో తెలిపోనుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక‌.. హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు వీలుగా ఈ రోజు (సోమ‌వారం) ఉద‌యం 11 గంట‌ల నుంచి ఓటింగ్ లైన్లు ఓపెన్ అవుతాయ‌ని చెబుతున్నారు.