హౌస్ మేట్స్ కు తేజ‌స్వి మార్కులు.. సామాన్యుడిపై బిగ్ బాంబ్‌

హౌస్ మేట్స్ కు తేజ‌స్వి మార్కులు.. సామాన్యుడిపై బిగ్ బాంబ్‌

మ‌రో ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా పూర్తి అయ్యింది. బిగ్ బాస్ సీజ‌న్ 2లో తాజా ఎలిమినేష‌న్ న‌టి తేజ‌స్వీ అన్న సంగ‌తి తెలిసిందే. ఎలిమినేష‌న్ సంద‌ర్భంగా నెల‌కొనే గంభీర‌మైన వాతావ‌ర‌ణాన్ని మార్చేందుకు స‌ర‌దా కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌టం.. హౌస్ మేట్స్ ముఖాల్లో చిరున‌వ్వులు పూచేలా చేసి.. ఈ వారానికి గుడ్ బై చెప్పేసే తీరుకు త‌గ్గ‌ట్లే.. తేజ‌స్వి ఎలిమినేష‌న్ సంద‌ర్భంగా ఆమెకు సైట్ అయ్యే ప‌ని ఒక‌టి చేయించారు.

బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు మార్కులు వేస్తూ.. వారిపై కామెంట్స్ చేయాలంటూ స్క్రాప్ బుక్ ఒక‌టి ఇచ్చారు. ఇందులో ప్ర‌తి పేజీలో హౌస్ మేట్స్ ఫోటోను ఉంచారు. వారికి త‌న‌దైన శైలిలో మార్కులు ఇచ్చిన తేజ‌స్వి.. కామెంట్స్ విష‌యంలోనూ త‌న మార్క్ ను క‌న‌ప‌ర్చారు.

హౌస్ మేట్స్ కు తేజ‌స్వి ఇచ్చిన మార్కులు చూస్తే..

1. సామ్రాట్        10/10
2. కౌశ‌ల్‌:             05/10
3. అమిత్           08/10
4. త‌నీశ్             10/10
5. నందిని          08/10
6. రోల్ రైడా       09/10
7. దీప్తి (పిట్ట‌)      08/10
8. గీతామాధురి  08/10
9. దీప్తి                08/10
10. గ‌ణేశ్           08/10
11. బాబు గోగినేని 10/10

మార్కులు ఇచ్చిన తేజిస్వి.. ఈ సంద‌ర్భంగా కౌశ‌ల్ మీద నెగిటివ్ కామెంట్ చేశారు. ఇది ఊహించిన విష‌య‌మే కానీ.. మ‌రో స‌ర్ ప్రైజింగ్ అంశం ఏమంటే.. రోల్ రైడాకు సంబంధించి బాంబ‌ర్అంటూ.. అత‌గాడు హౌస్ లో బాంబులు వేస్తారంటూ కొత్త విష‌యాన్ని చెప్పి షాకిచ్చారు. అయితే.. ఈ విష‌యాన్ని రివీల్ చేసిన తేజ‌స్వి పై చాలా సింఫుల్ గా.. చెప్పేశావా?  అంటూ స‌న్న‌టి న‌వ్వుతో త‌నపై ప‌డిన మైన‌స్ ను ప్ల‌స్ చేసేశాడు.

ఇక‌.. ఈ వారం బిగ్ బాంబ్ ను సామాన్యుడు గ‌ణేశ్ పై వేస్తున్న‌ట్లు తేజ‌స్వి చెప్పింది. ఇంత‌కీ.. ఈ వారం బిగ్ బాంబ్ ఏమంటే.. వారం పాటు..ప‌సిపిల్ల‌లు తాగే పాల‌బాటిల్ తో వాట‌ర్ తాగాల్సి రావ‌టం. పీక పెట్టి ఉన్న ఈ బాటిల్ తో వారం పాటు.. నీళ్లు తాగే క‌ష్ట‌మైన టాస్క్ ను గ‌ణేశ్ ఎలా చేస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English