ఈ స్టార్ కిడ్స్ కు బ్రేక్ కావలెను

ఈ స్టార్ కిడ్స్ కు బ్రేక్ కావలెను

సినిమా ఇండస్ట్రీలో వారసత్వానికి ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా స్టార్ కిడ్స్ విషయంలో ఇది మరింత ఎక్కువ.  కొంతమంది వారసత్వంతో సినిమాల్లోకి ఎంటరయినా త్వరగానే సొంత ఫ్యాన్ బేస్ సంపాదించుకుని కెరీర్ లో నిలదొక్కుకోగలుగుతారు. ఇంకొంతమందికి వారసత్వం అనేది మొదటి మెట్టుగానే మిగిలిపోతోంది. ఆ తరవాత కెరీర్ లో ముందుకెళ్లలేక కిందామీదా పడుతుంటారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది స్టార్ కిడ్స్ కెరీర్ లో హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ రంగప్రవేశం చేసిన నీహారిక.. నాగార్జున తనయుడు అఖిల్.. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్.. సుమంత్ అశ్విన్ ఇలా చాలామందికి కెరీర్ లో కమర్షియల్ హిట్ అందని ద్రాక్ష అయి కూర్చుంది. వీళ్లందరూ నటనపరంగా ఫర్వాలేదని అనిపించుకున్నా వీళ్ల సినిమాలేవీ ప్రేక్షకులనుమెప్పించలేకపోయాయి. కొత్తవాళ్లతో పోలిస్తే స్టార్ కిడ్స్ కు అవకాశాలు త్వరగా వస్తున్నా కెరీర్ లో కీలకమైన హిట్ కొట్టలేకపోవడం వీళ్లను ఇబ్బంది పెడుతోంది. ఒకటి రెండు హిట్లు కొట్టి మంచి పేరు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ్.. గోపీచంద్.. మంచు విష్ణు.. ఇలా చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టే అవుతుంది.

‘‘ఎవరికైనా ఒక స్థాయి వరకే సపోర్ట్ ఉపయోగపడుతుంది. ఆ తరవాత ఎవరికి వారే ఆడియన్స్ ను మెప్పించి గుర్తింపు తెచ్చుకోవాలి. సక్సెస్ అనేది సింపుల్ గా రాదు’’ అంటూ వారసత్వం గురించి మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాట.  మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత... కొత్త హీరో కార్తికేయ హీరోగా నటించిన ఆర్ఎక్స్ 100 ఒకేటైంలో వచ్చాయి. విజేత డీలా పడగా ఆర్ఎక్స్ 100 వసూళ్లలో దూసుకుపోతోంది. స్టార్ కిడ్స్ కు బ్రేక్ రావాలంటే కొత్తగా ఏదైనా ట్రయ్ చేయాల్సిందే. తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు