క్రిష్ కు సంక్రాంతి డబుల్ ధమాకా

క్రిష్ కు సంక్రాంతి డబుల్ ధమాకా

సంక్రాంతి పండగ అందరింటా సంతోషాలు వెల్లివెరిసే సమయం.  సినిమాలకు బాగా కలిసొచ్చే సీజన్. అందుకే ఈ సీజన్ కు సినిమా రిలీజ్ చేయడానికి చాలా ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. వచ్చే ఏడాది సంక్రాంతి క్రిష్ కు జీవితంలో మరిచిపోలేని పండగే. ఎందుకంటే అతడి జీవితంలో ప్రెస్టీజియస్ గా తెరకెక్కించిన రెండు సినిమాలూ అదే సీజన్ కు థియేటర్లకు రాబోతున్నాయి.

క్రిష్ ప్రస్తుతం బాలీవుడ్ లో మణికర్ణిక - ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. మరోవైపు టాలీవుడ్ లో బాలకృష్ణ హీరోగా ఆయన తండ్రి విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జీవితగాథగా వస్తున్న ఎన్టీఆర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపైనే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ రెండూ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. అలాగే ఇవి రెండూ దాదాపుగా ఒకే టైంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. జనవరి 9 నాటికి ఎన్టీఆర్ బయోపిక్  థియేటర్లకు వస్తుంది. మణికర్ణిక రిపబ్లిక్ డే నాటికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా జనవరి 25న సినిమా రిలీజ్ చేయబోతున్నారు.

స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో అరివీర భయంకరంగా పోరాడిన నారీమణి ఝాన్సీలక్ష్మిబాయ్ కథతో మణికర్ణిక సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తోంది. చాలా రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ లో ఉన్నా ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేశారు. జీ స్టూడియోస్ - కమల్ జైన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒకేట టైంలో కెరీర్ లో రెండు భారీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో క్రిష్ కు ఈసారి సంక్రాంతి పండగ గ్యారంటీగా డబుల్ ధమాకాయే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు