రెండు పడవల మీద కాలేసిన హీరో కూతురు

రెండు పడవల మీద కాలేసిన హీరో కూతురు

కొత్త అందాలకు వెల్ కం చెప్పడంలో టాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇక్కడ హిట్టయిన హీరోయిన్లకు ఇతర భాషల్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ వస్తే గ్యారంటీగా కోలీవుడ్ కూడా వాళ్లవైపు చూస్తుంది. హన్సిక.. ఆశిన్ లాంటివాళ్లు ఇక్కడ పాపులరయ్యాకే కోలీవుడ్ లో అవకాశాలు దక్కించుకున్నారు.

ఇండస్ట్రీలోకి వారసత్వంతో అడుగుపెడుతున్న రాజశేఖర్ కుమార్తె శివాని మాత్రం ఈ విషయంలో కాస్త కంగారు పడుతున్నట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం శివాని అడవి శేష్ హీరోగా చేస్తున్న 2 స్టేట్స్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ తెలుగు తెరకు పరిచయమవుతోంది. హిందీలో సూపర్ హిట్టయిన 2 స్టేట్స్ కు రీమేక్ గా ఈ సినిమా వస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తవలేదు. ఇంతలోనే కోలీవుడ్ లోనూ అడుగుపెట్టి డెబ్యూ సినిమా చేసేస్తోంది. విష్ణువిశాల్ హీరోగా తమిళంలో వస్తున్న మూవీలో శివాని హీరోయిన్ గా చేస్తోంది. ఇది కూడా దాదాపుగా 2 స్టేట్స్ రిలీజ్ టైంకే థియేటర్లకు రానుంది.

రెజీనా.. సమంతలాంటి తమిళ భామలు తెలుగులో హిట్టయ్యి పేరొచ్చాకే తరవాతే తమిళంలో ప్రయత్నించారు. లేదంటే తెలుగు భామ అంజలి టైపులో తమిళంలో హిట్టయ్యి తెలుగులో చేయొచ్చు. కాని ఒకేసారి రెండు చోట్ల డెబ్యూ అంటోంది శివాని. మరీ కెరీర్ మొదట్లోనే రెండు పడవలపై ప్రయాణమంటే రిస్కే. మరి ఏమవుతుందో ఏంటో..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు