గట్టిగా కొడతా.. నేడే విడుదల

గట్టిగా కొడతా.. నేడే విడుదల

సోషల్ మీడియాలోని జనాల కళ్లన్నీ ప్రధానంగా సినిమా వాళ్ల మీదే ఉంటాయి. చిన్నా పెద్దా అని చూడకుండా ఎవరినైనా టార్గెట్ చేస్తుంటారు. చిన్న అవకాశం దొరికినా ట్రోలింగ్‌కు దిగుతుంటారు. ఫన్నీ మీమ్స్‌తో కామెడీ పండిస్తుంటారు. సెలబ్రెటీల్లో దీన్ని కొందరు సరదాగా తీసుకుంటే.. కొందరు సీరియస్ అవుతుంటారు.

అక్కినేని కుటుంబం నుంచి యువ కథానాయకుడు సుశాంత్ ‘గట్టిగా కొడతా’ అనే సినిమాలో నటిస్తున్నట్లుగా ఆ మధ్య ఒక మీమ్ తయారు చేశారు నెటిజన్లు. సుశాంత్‌తో ఇంతకుముందు ‘ఆటాడుకుందాం రా’ సినిమా తీసిన నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది ఫేక్ అన్న అనుమానమే రాకుండా పక్కాగా పోస్టర్ తయారు చేసి వదిలారు. చాలామంది ఇది నిజమే అనుకున్నారు. గట్టిగా కొడతా.. ఇదేం టైటిల్ రా బాబూ అనుకున్నారు.

అటు తిరిగి.. ఇటు తిరిగి సుశాంత్ దగ్గరికే వచ్చింది ఈ పోస్టర్. దీన్ని అతను లైట్ తీసుకుంటూ సరదా కామెంట్ ఒకటి పెట్టాడు. అంతటితో ఆ వ్యవహారం ముగిసిపోయిందనుకుంటే.. సుశాంత్ మరోసారి ఆ పోస్టర్ ప్రస్తావన తెచ్చాడు. దాన్ని ట్విట్టర్లో షేర్ చేస్తూ ఈ నెల 22న విడుదల అంటూ డేట్ కూడా ఇవ్వడం విశేషం. ఇది చూసి సుశాంత్ మరీ ఇంత స్పోర్టివ్ అనుకోలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. హీరోగా పరిచయం అయి దశాబ్దం దాటినా ఇప్పటిదాకా హిట్టు కొట్టలేకపోయిన సుశాంత్ సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు.

అందులో భాగమే ‘గట్టిగా కొడతా’ అనే పోస్టర్. కానీ దీన్ని తేలిగ్గా తీసుకోవడం సుశాంత్ మంచి దృక్పథాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం సుశాంత్ ఆశలన్నీ ఈ శుక్రవారం విడుదల కాబోయే ‘చి ల సౌ’ మీదే ఉన్నాయి. నటుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించిన ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొంది. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ మీద ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటం విశేషం

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు