దిల్ రాజు సినిమా.. ఇంత దారుణమా?

దిల్ రాజు సినిమా.. ఇంత దారుణమా?

దిల్ రాజు సినిమా అంటే జనాల్లో ఉండే క్రెడిబిలిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అప్పుడప్పుడూ కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా.. ఇప్పటికీ ఆయన సినిమా అంటే జనాల్లో భరోసా ఉన్న మాట వాస్తవం. రాజు ప్రొడక్షన్లో సినిమా అంటే మినిమం ఓపెనింగ్స్ ఉంటాయి. టాక్ తేడా వస్తే ఓపెనింగ్స్‌పై రెండో రోజు నుంచి ప్రభావం పడటం ఓకే కానీ.. అసలు ఓపెనింగ్స్ మరీ పూర్‌గా ఉండటం అరుదు. కానీ రాజు నుంచి వచ్చిన కొత్త సినిమా ‘లవర్’ విషయంలో మాత్రం ఇదే జరిగింది.

ఈ చిత్రానికి దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు ఈ చిత్రం కేవలం రూ.50 లక్షల షేర్ రాబట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం. ముందు ఈ చిత్రంపై బజ్ బాగానే ఉన్నప్పటికీ.. రిలీజ్ ముంగిట అసలు ప్రమోషన్లే చేయకపోవడం చేటు చేసింది. పైగా దిల్ రాజు చిన్న సినిమాల గురించి.. రాజ్ తరుణ్ గురించి చేసిన నెగెటివ్ కామెంట్స్ చేటు చేశాయి. ఈ సినిమా విషయంలో రాజుకు కాన్ఫిడెన్స్ లేదన్న విషయం ఆయన మాటల్లో స్పష్టంగా తెలిసిపోయింది. ఇవన్నీ కలిసి ‘లవర్’ ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపాయి.

రాజ్ తరుణ్ ట్రాక్ రికార్డు ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ రాజు హ్యాండ్ పడింది కాబట్టి ‘లవర్’‌కు భిన్నమైన ఫలితం వస్తుందని అనుకుంటే.. ఇది కూడా తిరగబడింది. రెండో రోజు వసూళ్లు ఇంకా పడిపోయినట్లే కనిపిస్తోంది. రాజ్ తరుణ్ మార్కెట్‌కు మించి చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశారు ఈ చిత్రానికి. రూ.7 కోట్లకు పైనే బడ్జెట్ అయినట్లే తెలుస్తోంది. ఇప్పుడు అందులో నాలుగో వంతు షేర్ రావడం కూడా కష్టంగా ఉంది. వీకెండ్లో మహా అయితే కోటి రూపాయల షేర్ వస్తుందేమో. సోమవారం నుంచి వసూళ్లు మరీ నామమాత్రంగా ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. ఈ దెబ్బతో రాజ్ తరుణ్ కెరీర్‌ దాదాపుగా ముగిసిపోయినట్లే భావించాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు