నాగార్జున ప్లస్సే కానీ హీరో బ్యాడ్‌!

నాగార్జున ప్లస్సే కానీ హీరో బ్యాడ్‌!

చి.ల.సౌ సినిమా చూసి నిర్మాణ భాగస్వామిగా చేరిపోయిన నాగార్జున ఆ చిత్రంపై ఒక్కసారిగా నమ్మకాన్ని పెంచేసాడు. ఆల్రెడీ పూర్తయిన సినిమాని చూసి రిలీజ్‌ చేయడానికి ముందుకు రావడం కాకుండా నిర్మాతల్లో ఒకడిగా వుండాలని నాగార్జున అంతటివాడు భావించాడంటే ఆ సినిమా ఎంత బాగుందనేది అర్థమవుతూనే వుంది. నటుడు, సింగర్‌ చిన్మయి భర్త రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా మారి తీసిన ఈ చిత్రంలో కథానాయకుడు నాగార్జున మేనల్లుడు సుషాంత్‌. ఈ చిత్రంలో నాగార్జున పార్టనర్‌షిప్‌ తీసుకోవడంతో హైప్‌ అయితే వచ్చింది కానీ సుషాంత్‌కి వున్న ట్రాక్‌ రికార్డ్‌ కారణంగా క్రేజ్‌ మాత్రం రావడం లేదు. అందుకే ప్రమోషన్స్‌ పరంగా జాగ్రత్తలు తీసుకుని, తగినంత సమయం తీసుకుని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

నిజానికి ఈ చిత్రం వచ్చే శుక్రవారమే రావాల్సి వుంది కానీ వాయిదా వేసేసారు. సరిగ్గా ప్రమోట్‌ చేయకుండా రిలీజ్‌ చేసి, సినిమా బాగున్నా వసూళ్లు లేవనే మాట రావద్దని నాగార్జున దీనిని ప్రమోట్‌ చేయడం కోసం కొన్ని ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌ చేసే సంస్థలతో చర్చిస్తున్నారట. సుషాంత్‌ పలు చిత్రాల్లో నటించినా కానీ అతనికంటూ ఒక ఇమేజ్‌ లేకపోగా, అతడిని ఎప్పుడూ జనం సీరియస్‌గా తీసుకోలేదు. సొంత బ్యానర్లో సినిమాలు చేసుకుని హిట్లని చెప్పుకోవడమే తప్ప అతడికి పేరు తెచ్చిన సక్సెస్‌ లేదు. కొత్త నటుడు అయినా ఫర్వాలేదు కానీ ఫెయిలైన పాత యాక్టర్‌ సినిమాకి జనాన్ని థియేటర్లకి రప్పించడం అంత తేలిక కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English