శ్రీదేవి కూతురు అంచనాలు దాటేసింది

శ్రీదేవి కూతురు అంచనాలు దాటేసింది

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తొలి సినిమా ధడక్‌ రానే వచ్చింది. మరాఠీ చిత్రం సైరాట్‌కి రీమేక్‌ అయిన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ జాన్వీ అని ఒప్పుకోవాలి. తక్కువ బడ్జెట్‌లో కరణ్‌ జోహార్‌ నిర్మించిన ఈ చిత్రానికి తొలి రోజు ఆరు కోట్ల వరకు నెట్‌ వసూళ్లు వస్తాయని అంచనా వేసారు. కానీ తొలి రోజే అంచనాలని దాటేసి దాదాపు తొమ్మిది కోట్ల నెట్‌ వసూళ్లని ఈ చిత్రం సాధించింది. టాక్‌ కూడా బాగుండడంతో తొలి వారాంతంలో ముప్పయ్‌ కోట్ల నెట్‌ ఇండియా నుంచి వసూలవుతుందని అంచనాలున్నాయి.

నటిగా కూడా జాన్వీ మంచి మార్కులు కొట్టేసింది. విమర్శకుల్లో చాలా మంది ఆమెని మెచ్చుకుంటున్నారు. స్టార్‌ మెటీరియల్‌ అవుతుందని దాదాపు అయిదారేళ్ల నుంచి జాన్వీ రాక కోసం బాలీవుడ్‌ ఎదురు చూసింది. అయితే ఎంత శ్రీదేవి కూతురు అయినా హైప్‌ తప్ప జనాల్లో అంత స్పందన వుందని కొట్టి పారేసిన వాళ్లూ వున్నారు. అయితే మొదటి సినిమాకి మొదటి రోజే బాక్సాఫీస్‌ పరమైన అంచనాలని కూడా దాటేసి తన సత్తా ఏంటనేది చూపెట్టింది. జాన్వీకి బాలీవుడ్‌లో లభించిన స్వాగతంతో ఇక ఆమెని దక్షిణాదికి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరమవుతాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు