ఎక్స్‌ లవర్‌పై పగ తీర్చుకుంటోన్న హీరోయిన్‌

ఎక్స్‌ లవర్‌పై పగ తీర్చుకుంటోన్న హీరోయిన్‌

హృతిక్‌ రోషన్‌, కంగన రనౌత్‌ల వివాదం గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. పబ్లిగ్గానే ఒకరిపై ఒకరు అభియోగాలు వేసుకుని కోర్టుల వరకు వెళ్లిన ఈ ఇద్దరు మళ్లీ న్యూస్‌లోకి వచ్చారు. హృతిక్‌ని సిల్లీ ఎక్స్‌గా కంగన అభివర్ణిస్తే, ఆమెతో తనకసలు సంబంధమే లేదని, తనని వన్‌సైడ్‌గా ప్రేమించి టార్చర్‌ పెట్టిందని హృతిక్‌ చెప్పాడు. ప్రస్తుతం ఇద్దరి మధ్య లీగల్‌గా వివాదం నడుస్తోంది. ఇదిలావుంటే హృతిక్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం సూపర్‌ 30 వచ్చే యేడాది జనవరి 25న విడుదల కానుంది. రిపబ్లిక్‌ డే డేట్‌ని ఏనాడో హృతిక్‌ రిజర్వ్‌ చేసుకోగా, అదే రోజున తన సినిమా కూడా విడుదల చేయడానికి కంగన డిసైడయింది.

మణికర్నిక పేరుతో ఝాన్సీ రాణి కథని ప్రతిష్టాత్మకంగా చేసిన కంగన రనౌత్‌ ఆ చిత్రాన్ని హృతిక్‌ సినిమాకి పోటీగా విడుదల చేస్తోంది. పీరియడ్‌ సినిమాలకి ఇప్పుడున్న క్రేజ్‌ గురించి తెలిసిందే. ఇది కానీ హృతిక్‌ సినిమాతో రిలీజ్‌ అయితే ఖచ్చితంగా అతడి సినిమా ఎఫెక్ట్‌ అవుతుంది. కంగనతో గొడవలున్నాయి కనుక ఇప్పుడు తన సినిమా వాయిదా వేసుకోలేడు. అలాగని ఆమెతో రాజీకి వెళ్లలేడు. మరోవైపు హృతిక్‌ సినిమాతో రావడం కంగన సినిమాకి కూడా నష్టం కలిగించేదే. అయినప్పటికీ తన తీరు తెలిసిన వాళ్లు ఇక వెనక్కి తగ్గుతుందని మాత్రం అనుకోవడం లేదు. ఆసక్తికరంగా మారిన ఈ మాజీ లవర్స్‌ వార్‌ ఇప్పుడు బాలీవుడ్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English