గీత దాటేస్తోన్న వైట్ల

గీత దాటేస్తోన్న వైట్ల

వరుసగా మూడు డిజాస్టర్లు తీసిన శ్రీను వైట్లతో పని చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే, అతని తొలి హీరో రవితేజ డేట్స్‌ ఇచ్చాడు. ప్రస్తుతం అమర్‌ అక్బర్‌ ఆంటోని అంటూ రవితేజతో ఒక మాస్‌ ఎంటర్‌టైనర్‌ని వైట్ల తెరకెక్కిస్తున్నాడు. భారీ నిర్మాణ విలువలున్న చిత్రాలకి పని చేయడం అలవాటున్న శ్రీను వైట్ల ఈ చిత్రానికి కూడా అలాగే ఖర్చు పెట్టించేస్తున్నాడట.

ప్రస్తుతం శ్రీను వైట్లకి అసలు క్రేజ్‌ లేకపోవడంతో పాటు రవితేజ నటించిన ఇటీవలి చిత్రాలు దారుణంగా ఫ్లాప్‌ అవడంతో బడ్జెట్‌ ఎక్కువయితే ఈ చిత్రం కాస్ట్‌ ఫెయిల్యూర్‌ అయ్యే అవకాశముంది. మొదట్లో బడ్జెట్‌ పెరుగుతున్నా పట్టించుకోని నిర్మాతలు నేల టిక్కెట్టు ఫెయిల్యూర్‌ తర్వాత కాస్త ఆందోళనగా వున్నారట. దీంతో కాస్ట్‌ కటింగ్‌ కోసమని విదేశాల్లో ప్లాన్‌ చేసిన షెడ్యూల్స్‌ అన్నీ కాన్సిల్‌ చేసి హైదరాబాద్‌లోనే తీసేస్తున్నారు. శ్రీను వైట్లకి చెప్పిన బడ్జెట్‌కి మించి ఖర్చు పెట్టించడం అలవాటు. ఈసారి కూడా గీత దాటేస్తోంటే నిర్మాతలు ముందే జాగ్రత్త పడ్డారు. రవితేజ కూడా వారి తరఫునే నిలబడి కాస్ట్‌ కటింగ్‌కి ఓకే అన్నాడట. ఏదేమైనా ఈ చిత్రం మాస్‌ మహారాజాతో పాటు శ్రీను వైట్ల కెరియర్‌కి కూడా అత్యంత కీలకంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English