లేదు లేదు.. ఇంకా దాగుడు మూతలే

లేదు లేదు.. ఇంకా దాగుడు మూతలే

దువ్వాడ జగన్నాథమ్ తరవాత డైరెక్టర్ హరీష్ శంకర్ పరిస్థితి అయోమయంగా తయారైంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య రిలీజై వాటిని అందుకోలేక పోయింది. ఆ సినిమా చేదు అనుభవం నుంచి బయటపడి కొత్త సినిమా మొదలుపెడదామని హరీష్ శంకర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అతడికి టైం కలిసిరావడం లేదు.

హరీష్ శంకర్ ఈమధ్య దాగుడు మూతలు టైటిల్ తో ఓ స్టోరీ రెడీ చేశాడు. ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ గా ఈ మూవీ తీయాలన్నది అతడి ఆలోచనగా ఉందని తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజుకు ఈ స్టోరీ కూడా నెరేట్ చేశాడు. కానీ దీనిపై దిల్ రాజు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఏమీ లేదు. దీంతో వీళ్లిద్దరి మధ్య గొడవలై ఇద్దరు కటీఫ్ చెప్పేసుకున్నారని... హరీష్ శంకర్ వేరే నిర్మాతను వెతుక్కునే పనిలో పడ్డాడనే టాక్ వినిపించింది. కానీ ఇదంతా ఉత్తి గాసిప్పేనని తెలుస్తోంది. హరీష్ శంకర్ దిల్ రాజు ప్రొడక్షన్ లోనే దాగుడు మూతలు సినిమా తీయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

దాగుడు మూతలు సినిమాకు హీరోలుగా నితిన్ అండ్ శర్వానంద్ ను తీసుకోవాలన్నది హరీష్ శంకర్ ఐడియా. కానీ వాళ్లిద్దరూ ఇప్పుడు వేరే కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. దీంతో మల్టీ స్టారర్ అంటే వర్కవుట్ అవదన్నది దిల్ రాజు ఆలోచనగా ఉందని తెలుస్తోంది. అందుకే ఒక్క హీరోతో తీసేలా స్టోరీ మార్చి రాయమని అడుగుతున్నాడట. వీళ్లిద్దరరిలో ఎవరో ఒకరు ఏదో ఒక డెసిషన్ కు వస్తే దాగుడు మూతలకు తెర లేస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English