భారతీయుడి వారసుడు ఎవరు?

భారతీయుడి వారసుడు ఎవరు?

సాధారణ ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. ఈసారి ఎన్నికల బరిలో దిగుదామని అనుకుంటున్న నటులు పాలిటిక్స్ పైనే ఫోకస్ పెడుతున్నారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పనుల్లో గా బిజీ అయిపోయాడు. తమిళనాడులో పార్టీ పెట్టిన హీరో కమల్ హాసన్ కూడా తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని అంటున్నారు.

పవన్ అజ్ఞాతవాసి తరవాత సినిమాలు పక్కన పెట్టాడు.  ప్రస్తుతం అతడికి కమిట్ మెంట్స్ ఏమీ లేవు. కానీ కమల్ ఇంకా సినిమాల నుంచి పూర్తిగా బయటకు రాలేదు. విశ్వరూపం-2 షూటింగ్ అయిపోయింది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు-2 సినిమా సంగతిపైనే ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాపై కోలీవుడ్ లో చాలా ఆసక్తి ఉంది. కమల్ రాజకీయాల్లో బిజీ అయిపోతే ఈ సినిమా ఎప్పటికి కంప్లీట్ చేస్తాడనే డౌట్ చాలామందికి ఉంది.

కమల్ పాలిటిక్స్ లో బిజీ అయిపోయినా భారతీయుడు-2కు వచ్చిన ఇబ్బందేమీ లేదని శంకర్ టీం అంటోందిట. దీనికి కారణం ఈ సినిమాలో కథానుసారం కమల్ చిన్నరోల్ మాత్రమే చేస్తాడని చెబుతున్నారు. మిగతా సినిమా కథంతా ఓ యంగ్ హీరో చుట్టూ తిరుగుతుందిట. అందుకే శంకర్ ఈ సినిమా విషయంలో కంగారు పడకుండా కూల్ గా ఉంటున్నాడని అంటున్నారు. ఇంతకీ ఆ భారతీయుడు వారసుడు ఎవరన్నదే ఇంకా క్లారిటీ రాలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు