కొత్త డైరెక్టర్ కే దిల్ రాజు ఛాన్స్

కొత్త డైరెక్టర్ కే దిల్ రాజు ఛాన్స్

టాలీవుడ్ టాప్ ఫ్రొడ్యూసర్లలో ఒకడైన దిల్ రాజు ప్రొడక్షన్ హౌన్ నుంచి కొత్త డైరెక్టర్లు బోలెడు మంది వచ్చారు. కానీ మొదటిసారిని ఓ హీరోను తీసుకురావడానికి దిల్ రాజు.. ఆయన టీం మొత్తం చాలారోజులుగా వర్క్ చేస్తూ వస్తోంది.  దిల్ రాజు ఆప్తుడు శిరీష్ కొడుకు ఆశిష్ రెడ్డిని హీరోగా పరిచయం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి.

దిల్ రాజు కు ఉన్న పలుకుబడి దృష్ట్యా అతడి దగ్గర పనిచేసి టాప్ డైరెక్టర్లు అయిన వారిలో ఎవరైనా ఆశిష్ రెడ్డిని హీరోగా పెట్టి సినిమా తీస్తారు. కానీ ఈ ఛాన్స్ దిల్ రాజు ఓ కొత్త డైరెక్టర్ కు ఇస్తున్నాడని తెలిసింది. నాని హీరోగా ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ కు అసిస్టెంట్ గా పనిచేసిన సతీష్ కు అవకాశం ఇవ్వబోతున్నారట. సతీష్ డైరెక్టర్ అవడం కోసం సిద్ధం చేసుకున్న కథ నచ్చడంతో కొన్ని మార్పుచేర్పులు చేయాల్సిందిగా దిల్ రాజు అడిగాడని తెలిసింది. ఈమధ్య ఆ పనులు పూర్తయి స్క్రిప్ట్ లాక్ చేశాడని దిల్ రాజు సన్నిహితుడు ఒకరు చెప్పుకొచ్చారు.

వేరే హీరోలతో తీసే సినిమాల్లోనే దిల్ రాజు వీలైనంత ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయి మంచిచెడులు గమనిస్తుంటాడు. ఈసారి ఏకంగా ఫ్యామిలీలో హీరోను లాంచింగ్ ప్రాజెక్టు కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇప్పటికే ఆశిష్ రెడ్డి  పైట్లు.. డ్యాన్యులో ట్రయినింగ్ అవుతున్నాడు. ఈ సినిమా కథ ప్రకారం కొత్త హీరోయిన్ గా అయితే బాగుంటుందని వెతుకులాట మొదలెట్టారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు