కొత్త హీరోయిన్ ఇంకా చాలా నేర్చుకోవాలి

కొత్త హీరోయిన్ ఇంకా చాలా నేర్చుకోవాలి

ఈమధ్య కాలంలో ఓ కొత్త హీరోయిన్ మొదటి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని దేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రేక్షకులు ఎదురుచూసిన సందర్భం ఏదన్నా ఉంది అంటే అది అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ విషయంలోనే. ఆమె హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన ధడక్ సినిమా తాజాగా థియేటర్లకు వచ్చింది.

మరాఠీలో బ్లాక్ బస్టర్ హిట్టయిన సైరత్ మూవీకి రీమేక్ గా ధడక్ తెరకెక్కింది. ఇందులో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తమ్మడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించాడు. ధడక్ మూవీలో అందరూ ప్రత్యేకంగా గమనించింది జాన్వినే. ఈ విషయంలో జాన్వి బాగానే మార్కులు సంపాదించుకుంది. అలాగని అద్భుతంగా నటించిందనీ చెప్పలేం. ఒకస్థాయి వరకు ఆమె నటన మెప్పిస్తుంది. బాలీవుడ్ లోని రివ్యూయర్లంతా జాన్వి నటనకు మంచి మార్కులే వేశారు. మరాఠీ ప్రేక్షకులు.. రివ్యూయర్లు మాత్రం సైరత్ తో పోల్చి చూడటంతో జాన్వి విషయంలో పెదవివిరుస్తున్నారు.

ధడక్ సినిమా షూటింగ్ లో ఉండగానే జాన్వికి తల్లి శ్రీదేవి దూరమైంది. అంతులేని బాధను తట్టుకుని దాని నుంచి తక్కువ టైంలోనే బయటకొచ్చి చకచకా షూటింగ్ పూర్తిచేసింది. అంతవకు ఆమె కమిట్ మెంట్  అంతటా ప్రశంసలు లభించాయి. తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమాల్లోకి అడుగుపెట్టిన జాన్వి తాను ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా చాలానే ఉందని అంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English