చెయ్యి లేని వాడిగా యంగ్ హీరో

చెయ్యి లేని వాడిగా యంగ్ హీరో

ప్రస్తుతం తెలుగులో ‘వీర భోగ వసంత రాయలు’ అనే మినీ మల్టీస్టారర్ ఒకటి రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇంద్రసేన అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ రోజు ఈ చిత్రం నుంచి శ్రియ సరన్ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. శ్రియ ఇంతకుముందెన్నడూ లేనంత విభిన్నంగా ఇందులో కనిపిస్తోంది. చాలా ఇంటెన్స్‌గా ఉన్న ఆ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రంలో నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.శ్రియ తర్వాత నారా రోహిత్ లుక్‌ను పరిచయం చేయబోతున్నారట. అది చాలా షాకింగ్‌గా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో రోహిత్ ఒక చెయ్యి లేని అవిటివాడిలా కనిపించనున్నాడట.

అతడికి కుడి చెయ్యి ఉండదట. రోహిత్‌ది మామూలుగానే ఎడమ చేతి వాడటం. అందుకే సినిమాలో కుడి చెయ్యి లేనట్లు చూపిస్తూ.. ఎడమ చేత్తో అన్ని పనులూ చేసుకునే వ్యక్తిగా చూపిస్తున్నారట. సుధీర్ బాబు, శ్రీవిష్ణుల పాత్రలు కూడా కొత్తగానే ఉంటాయంటున్నారు.

ఈ చిత్ర దర్శకుడు ఇంద్రసేన గురించి హీరో సుధీర్ బాబు ఇంతకుముందే చాలా గొప్పగా చెప్పాడు. అతను టాలీవుడ్ క్రిస్టఫర్ నోలన్ అనేశాడు. ‘వీర భోగ వసంత రాయలు’ ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుందని కూడా చెప్పాడు. మరి అంత గొప్పగా చెప్పాడంటే ఇందులో ఏం ప్రత్యేకత ఉంటుందో చూడాలి. కొత్త నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ​

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English