కూతురిపై మహేష్ ప్రేమ చూడండి

కూతురిపై మహేష్ ప్రేమ చూడండి

ఎలాంటి వ్యక్తులైనా ఒక బిడ్డకు తండ్రి అయ్యాక చాలా మారిపోతారని అంటారు. ఇందుకు సెలబ్రెటీలు కూడా మినహాయింపేమీ కాదు. అప్పటిదాకా ఒకలా కనిపించిన వాళ్లు.. తండ్రిగా మారాక కొత్తగా కనిపిస్తారు. ఎంత పెద్ద స్టార్ అయినా.. సగటు తండ్రిలాగే ప్రవర్తిస్తుంటారు. మహేష్ బాబు కూడా అంతే. తన పిల్లల విషయంలో మహేష్ ఎంత ప్రేమ చూపిస్తాడో.. ఎలా చిన్నపిల్లాడిలా మారిపోతాడో చాలాసార్లు చూశాం.

ఇక ఈ రోజు తన ముద్దుల కూతురు సితార పుట్టిన రోజు సందర్భంగా మహేష్ ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ మెసేజ్‌లో మహేష్ అందరికీ కొత్తగా కనిపించాడు. తన కూతురు తనకు  ‘ఎవ్రీథింగ్’ అని మహేష్ పేర్కొనడం విశేషం. లవ్ ఇమోజీలు పెట్టి ఆమెకు ఆరో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మహేష్.. చివర్లో ‘ఐ లవ్యూ సీతా పాప’ అన్నాడు. చివర్లో.. మధ్యలో కూడా తన సంతోషాన్ని, ప్రేమను చాటి చెప్పే ఇమోజీలు పెట్టాడు. తన కూతురి కలిసి చాలా హుషారుగా ఉన్న ఒక లవ్లీ ఫొటోను కూడా మహేష్ షేర్ చేశాడు.

సితార మహేష్ తల్లి పోలికలతో పుట్టడం విశేషం. అందుకే కూతురంటే మహేష్‌కు అంత ప్రేమ. మహేష్ ప్రతి సినిమా షూటింగుకీ సితార వెళ్తుంటుంది. ప్రిన్స్ లేటెస్ట్ హిట్ ‘భరత్ అనే నేను’ షూటింగ్ సెట్లోనూ ఆమె సందడి చేసింది. మహేష్ హీరోయిన్లతో సితారకు మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. కియారా అద్వానీ.. రకుల్ ప్రీత్.. సమంత లాంటి వాళ్లు సితారతో సెట్స్‌లో ఆటలు ఆడుతూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు