మహేష్ ఆయన్ని నమ్మాడు.. ఆయన ఆమెను

మహేష్ ఆయన్ని నమ్మాడు.. ఆయన ఆమెను

సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు ఎక్కువ. ఓ హీరో హీరోయిన్ కాంబినేషన్లో ఒక ఫ్లాప్ వస్తే మళ్లీ ఆ కాంబినేషన్‌ను రిపీట్ చేయడానికి భయపడతారు. కానీ కొందరు ఫిలిం మేకర్లు మాత్రం ఇలాంటి సెంటిమెంట్లను పట్టించుకోకుండా కాంబినేషన్లను సెట్ చేస్తారు. సుకుమార్ కూడా ఆ కోవలోని దర్శకుడే.

‘రంగస్థలం’తో భారీ విజయాన్నందుకున్న ఆయన తన తర్వాతి సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘1 నేనొక్కడినే’ డిజాస్టర్ అయినప్పటికీ.. అదేమీ మనసులో పెట్టుకోకుండా సుక్కుతో మళ్లీ పని చేయడానికి మహేష్ ఓకే చెప్పాడు. మహేష్ సుక్కును నమ్మితే.. సుక్కు ఓ హీరోయిన్‌ని నమ్మాడు.

మహేష్ బాబుతో రకుల్ ప్రీత్ కలిసి నటించిన ‘స్పైడర్’ డిజాస్టర్ అయినప్పటికీ.. అదేమీ పట్టించుకోకుండా ఆమెకు తమ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. సుకుమార్ ఇంతకుముందే ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో రకుల్‌కు ఛాన్సిచ్చాడు. అందులో చక్కగా నటించి మెప్పించిందీ భామ. దీంతో మహేష్ సినిమా కోసం కూడా ఆమెనే కథానాయికగా ఎంచుకున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి ఇంకా స్క్రిప్టు రెడీ కాలేదని సమాచారం. రెండు నెలలుగా ఈ స్క్రిప్టు మీదే పని చేస్తున్నాడు సుక్కు. మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తయ్యే సమయానికి సుకుమార్ స్క్రిప్టుతో రెడీగా ఉండాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది. సుకుమార్‌తో ‘రంగస్థలం’ తీసిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు