మూడో మున్నాబాయ్‌లో సంజయ్, రణబీర్

మూడో మున్నాబాయ్‌లో సంజయ్, రణబీర్

చాలా తక్కువ సినిమాలతో దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించాడు రాజ్ కుమార్ హిరాని. దర్శకుడిగా తొలి సినిమాతోనే ఆయన పేరు మార్మోగింది. ఆ చిత్రమే.. మున్నాబాయ్ ఎంబీబీఎస్. ఇండియన్ ఫిలిం హిస్టరీలో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, తమిళంలో లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం విశేషం.

అసలు కెరీర్లో ఎన్నడూ రీమేక్‌ల జోలికి వెళ్లని కమల్.. ఈ చిత్రాన్ని పునర్నిర్మించడానికి ఓకే చెప్పాడంటేనే ఈ సినిమా గొప్పదనమేంటో అర్థం చేసుకోవచ్చు. దీనికి కొనసాగింపుగా హిరాని ‘మున్నాబాయ్ లగేరహో’ తీస్తే అది కూడా సూపర్ హిట్టయింది. ఆపై ‘త్రీ ఇడియట్స్’.. ‘పీకే’ చిత్రాలు తీసిన ఆయన.. ఇటీవలే ‘సంజు’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇది హిరాని ఖాతాలో ఐదో బ్లాక్ బస్టర్‌ను జమ చేసింది.

దీని తర్వాత హిరాని తీసే సినిమా ఏదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన ‘మున్నాబాయ్’ సిరీస్‌లో మూడో సినిమా తీయబోతున్నాడని సమాచారం. ఈ చిత్రంలోనూ సంజయ్ దతే హీరో. ఐతే ఆయనకు అసిస్టెంట్‌గా సర్క్యూట్ పాత్రలో నటించబోయే కనిపించబోయేదెవరో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే. తొలి రెండు భాగాల్లో అర్షద్ వార్షి పోషించిన ఈ పాత్రలో ఈసారి రణబీర్ కపూర్ కనిపిస్తాడట.

సంజయ్ దత్ జీవిత కథతో తెరకెక్కిన ‘సంజు’లో రణబీర్ ఎంత అద్భుతంగా నటించి మెప్పించాడో తెలిసిందే. రణబీర్ రేంజ్ ఎక్కువే అయినప్పటికీ హిరాని, సంజయ్‌ల కోసం అతను ఇందులో సహాయ పాత్ర చేయడానికి ఓకే అన్నాడట. ఈ కాంబినేషన్ కచ్చితంగా అమితాసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. నిజానికి ‘మున్నాబాయ్ చలే అమెరికా’ పేరుతో కొన్నేళ్ల కిందటే హిరాని సినిమా తీయాలనుకున్నాడు. ఆ కథతోనే ఇప్పుడు సినిమా తీయబోతున్నాడట. కానీ కార్యరూపం దాల్చలేదు. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English