పెళ్లి పుకార్ల‌పై సునీత క్లారిటీ!

పెళ్లి పుకార్ల‌పై సునీత క్లారిటీ!

ప్ర‌ముఖ‌ సినీ గాయని సునీత రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ ...వెబ్ మీడియా, సోష‌ల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.  ఐటీ రంగానికి చెందిన ఓ వ్య‌క్తిని సునీత పెళ్లి చేసుకోబోతోంద‌ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో, ఆ వార్త‌ల‌పై సునీత స్పందించారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి ఎప్పుడూ ఎందుకంత ఆసక్తిని కనబరుస్తారని సునీత త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ త‌ర్వాత ఫేస్ బుక్ లైవ్ చాట్ లో సునీత త‌న పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. తానెవ‌రినీ పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని, త‌న పెళ్లి గురించి వ‌స్తోన్న వార్త‌ల్లో ఏ మాత్రం వాస్త‌వం లేద‌ని చెప్పారు. కొన్ని వెబ్ సైట్లు, సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న పుకార్ల‌కు చెక్ పెట్టేందుకే ఫేస్ బుక్ లైవ్ కు వ‌చ్చాన‌ని సునీత చెప్పారు. ఇక‌నైనా, ఆ వార్త‌ల‌ను ఆపాల‌ని, ఆ వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని చెప్పారు.

గ‌త రాత్రి నుంచి త‌న ఫోన్ కు చాలా మెసేజ్ లు, కాల్స్ వ‌స్తున్నాయ‌ని సునీత చెప్పారు. తాను మ‌ళ్లీ  పెళ్లి చేసుకోవాల‌ని ఇంత‌మంది శ్రేయోభిలాషులు, మిత్రులు కోరుకోవ‌డం సంతోషాన్నిచ్చింద‌ని సునీత అన్నారు. తాను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాల‌ని ఇంత‌మంది కోరుకోవ‌డం ఆనందాన్నిచ్చింద‌న్నారు. అయితే, ప్ర‌స్తుతం త‌న‌కు పెళ్లి ఆలోచ‌న  ఏదీ లేద‌ని, ఇపుడు వ‌స్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని చెప్పారు. ఒక వేళ భవిష్య‌త్తులో అటువంటిందేమైనా ఉంటే స్వ‌యంగా తానే వెల్ల‌డిస్తాన‌ని సునీత తెలిపారు. అస‌లు ఇపుడు పెళ్లి చేసుకునే సమ‌యం ...సంద‌ర్భం రెండూ కావ‌ని అన్నారు. నెల రోజుల క్రిత‌మే తన నాయ‌న‌మ్మ చ‌నిపోయార‌ని, ఆ కార్య‌క్ర‌మాల్లో తాను బిజీగా ఉన్నాన‌ని అన్నారు. కేవ‌లం ఆ పుకార్ల‌పై క్లారిటీ ఇచ్చేందుకే ఫేస్ బుక్ లైవ్ కు వ‌చ్చాన‌ని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు