దిల్‌ రాజు కూడా హ్యాండిచ్చేస్తే ఎలా?

దిల్‌ రాజు కూడా హ్యాండిచ్చేస్తే ఎలా?

రాజ్‌ తరుణ్‌ ఫుల్‌ ఫామ్‌లో వున్నపుడు రెండు సినిమాలకి దిల్‌ రాజు డీల్‌ చేసుకున్నాడు. అయితే ఆ టైమ్‌లో రాజ్‌ తరుణ్‌ ఎక్కువ పారితోషికం డిమాండ్‌ చేసాడని దిల్‌ రాజు ఆ రెండు ప్రాజెక్టులకీ హీరోని మార్చేసాడు. ఆ చిత్రాలే శతమానం భవతి, నేను లోకల్‌. ఈలోగా రాజ్‌ తరుణ్‌ చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. దీంతో దిల్‌ రాజు బ్యానర్లో చేసి మళ్లీ పుంజుకుందామని చూసాడు. ఇందుకోసం అతను తన మార్కెట్‌ రేటు కంటే తక్కువ పారితోషికానికి చేయడానికి అంగీకరించాడు.

రాజ్‌ తరుణ్‌తో సినిమా అయితే తీసాడు కానీ నిర్మాణ బాధ్యతలు హర్షిత్‌ రెడ్డికి అప్పగించాడు. బడ్జెట్‌ పరంగా కాంప్రమైజ్‌ కాకపోయినా దిల్‌ రాజు ఈ చిత్రం విషయంలో అసలు ఇన్‌వాల్వ్‌ కాకపోవడంతో ఫైనల్‌ ప్రోడక్ట్‌ చూసిన తర్వాత కూడా అతనిలో ఎలాంటి ఆసక్తి కనిపించడం లేదు. పబ్లిసిటీ పరంగా దిల్‌ రాజు ఏమాత్రం కాంప్రమైజ్‌ అవడు. కానీ ఈ చిత్రానికి మాత్రం ఎంత వస్తే అంతే వస్తుందన్నట్టు వ్యవహరిస్తున్నాడు.

తనకి ఎలాగైనా హిట్‌ ఇస్తాడని భావించి దిల్‌ రాజుని నమ్మి లవర్‌ చేస్తే, అతనేమో ఈ చిత్రంపై అసలు దృష్టి పెట్టకపోగా, తనకి మార్కెట్‌ లేదంటూ మీడియాతో మాట్లాడ్డం పుండు మీద కారం చల్లినట్టవుతోంది రాజ్‌ తరుణ్‌కి. రాజు నిర్లక్ష్యం చేసినా అదృష్టం కలిసొచ్చి ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పిస్తుందని ఆశిస్తూ రేపటి రిజల్ట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English