పవన్‌ హీరోయిన్‌ మీదే అందరి కళ్ళు

పవన్‌ హీరోయిన్‌ మీదే అందరి కళ్ళు

క్షణంతో అడివి శేష్‌కి నటుడిగా మంచి గుర్తింపు దక్కింది. ఆ గుర్తింపుని నిలబెట్టుకోవడం కోసం తదుపరి చిత్రానికి చాలా సమయం తీసుకున్న శేష్‌ 'గూఢచారి' చిత్రాన్ని సెట్‌ చేసాడు. తన మార్కెట్‌కి ఎన్నో రెట్లు మించిన ఖర్చుతో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ టీజర్‌కి ఇప్పటికే విశేష ఆదరణ దక్కుతోంది. నాలుగు మిలియన్లకి పైగా వ్యూస్‌ సాధించిన ఈ టీజర్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సుప్రియ యార్లగడ్డ.

అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, పవన్‌కళ్యాణ్‌ తొలి కథానాయిక అయిన సుప్రియ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. నాగార్జున నిర్మించే చిత్రాలకి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా సినీ రంగంతో అనుబంధాన్ని కొనసాగించిన సుప్రియ మళ్లీ తెరపైకి వస్తోంది గూఢచారితోనే. ఈ చిత్రంలోని ఈ పాత్ర ఆమెని ఎందుకంతగా ఎక్సయిట్‌ చేసిందీ, ఎందుకని మళ్లీ సుప్రియ నటించిందీ అంటూ ఆమె వల్ల ఈ చిత్రానికి అదనపు మైలేజ్‌ దక్కుతోంది.

రా ఆఫీసర్‌ నదియా ఖురేషీగా ఆమె పాత్ర ఇందులో చాలా కీలకమట. క్షణంలో అనసూయ పోషించిన పాత్ర ఎంత కీలకమో ఇది కూడా కథకి అంత ఇంపార్టెంట్‌ అని, పవన్‌ ఫస్ట్‌ హీరోయిన్‌ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నటించిందంటే ఆ ఆసక్తి ఖచ్చితంగా ప్లస్‌ అవుతుందని అడివి శేష్‌ ఏరికోరి సుప్రియని ఈ పాత్రకి ఎంపిక చేసాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు