శ్రీరెడ్డి బుట్టలో పడుతోన్న అరవోళ్ల

శ్రీరెడ్డి బుట్టలో పడుతోన్న అరవోళ్ల

శ్రీరెడ్డికి కావాల్సిన పబ్లిసిటీని మొదట్లో టీవీ ఛానళ్ల వాళ్లు కల్పిస్తే ఆ తర్వాత ఆమె ఆరోపణలకి స్పందిస్తూ కొందరు నటీనటులు, ఇతర సినిమా వాళ్లు ఆమెని న్యూస్‌లో వుంచారు. మహిళా సంఘాల వాళ్లనీ, ఓయూజెఏసి అని, జూనియర్‌ ఆర్టిస్టుల సంఘమని పలువురు వచ్చి ఆమెని ఒక ఉద్యమానికి లీడర్‌ని కూడా చేసారు. అయితే అనూహ్యమైన స్పందనతో అవగాహన లేమితో వచ్చిన పాపులారిటీని ఎలా వాడుకోవాలో తెలియక పవన్‌కళ్యాణ్‌ని దూషించి మొదటికే చేటు తెచ్చుకుంది.

అప్పట్నుంచీ శ్రీరెడ్డిని టాలీవుడ్‌ మీడియా పక్కన పెట్టేస్తే, ఫేస్‌బుక్‌ ద్వారా పలువురు ప్రముఖులపై అభాండాలు వేస్తూ వార్తల్లో వుంటోంది. నాని మీద ఆధారాలు లేని ఆరోపణలు చేయడంతో అతను ఆమెపై లీగల్‌గా ప్రొసీడ్‌ అయ్యాడు. ఇదిలావుంటే ఈ రొంపిలోకి విశాల్‌ దిగాడు. మీడియా అడగడంతో తన స్పందన వినిపించిన విశాల్‌ డైరెక్టుగా తన పేరు ఎత్తేసరికి ఇక శ్రీరెడ్డి తమిళ చిత్ర రంగం మీదకి తన దృష్టి మరల్చింది. కుష్బూ భర్త సి. సుందర్‌పై కూడా ఆరోపణలు చేసింది.

దీంతో తమిళ మీడియా ఆమెని పిలిచి ఇంటర్వ్యూలు మొదలు పెట్టింది. ఇప్పుడు కార్తీ లాంటి ప్రముఖులు కూడా శ్రీరెడ్డి పేరు ఎత్తుతూ ఆమెకి సలహాలు అవీ ఇచ్చేస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్‌ పట్టించుకోకుండా వదిలేసిన శ్రీరెడ్డికి ఇప్పుడు కోలీవుడ్‌లో ఇక్కడికి మించిన అటెన్షన్‌ దక్కుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు