బసవతారకం కథ చాలా ఉంది..

బసవతారకం కథ చాలా ఉంది..

విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జీవిత గాథతో ఆయన తనయుడు హీరో బాలకృష్ణ తీస్తున్న చిత్రం టాలీవుడ్ లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి. ఎన్టీఆర్ బయోపిక్ లో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తోంది. హీరో బాలయ్య డైరెక్టర్ క్రిష్ ఈ పాత్ర ఆమే చేయాలని గట్టిగా ఫిక్సయ్యారు. అందుకే బాలయ్య ఆమె ఇంటికి వెళ్లి కథ వినిపించి మరీ ఈ రోల్ కు ఒప్పించారు.

ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రకు విద్యాబాలన్ ను తీసుకోవడం కేవలం స్టార్ వాల్యూ కోసమే కాదు.. దాని వెనుక వేరే రీజన్స్ ఉన్నాయని నందమూరి ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు. ‘‘బసవతారకం గురించి జనాలకు తెలిసింది చాలా తక్కువ. ఆమె మామూలు గృహిణి కాదు. భర్త సూపర్ స్టార్ అయినా ఆమె కుటుంబానికి అంకితమై జీవించారు. ఎన్టీఆర్ జీవితంలో సాధించిన ఎన్నో విజయాల వెనుక ఆమె పాత్ర చాలా కీలకం. మామూలు మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఎన్టీఆర్ సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తానని అన్నప్పుడు వడ్డాణం అమ్మి మరీ ఆయనను చెన్నై పంపింది బసవతారకమే. సినిమాల్లో బిజీ అయిపోయినా 12 మంది సంతానాన్ని సమర్ధంగా పెంచుకుంటూ రావడం బసవతారకం నేర్పు ఎంతో ఉంది’’ అంటున్నారు నందమూరి ఫ్యామిలీ సన్నిహితులు.

ఈతరం హీరోయిన్లలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్న వారిలో విద్యాబాలన్ ముందుంటుంది. అందుకే ఆమెలాంటి గొప్పనటి మాత్రమే బసవతారకం పాత్రకు న్యాయం చేయగలదని డైరెక్టర్ క్రిష్ ఫీలయ్యాడట. ఈ క్యారెక్టర్ కు ఉన్న ప్రాధాన్యం వివరించగానే ఆమె కూడా ఈ రోల్ చేయడానికి ఒప్పుకొంది. బసవతారకం మంచి సింగర్. దాంతో పాటు హార్మోనియం చాలా చక్కగా ప్లే చేసేవారు. ఈ పాత్ర చేయడం కోసం హార్మోనియం ప్లే చేయడం ఎలాగో నేర్చుకోవడం విద్యాబాలన్ తెలుసుకుంటోందిట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు