అక్కడన్నా జనాలు చూస్తారో లేదో!!

అక్కడన్నా జనాలు చూస్తారో లేదో!!

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా రిలీజయింది అంటే థియేటర్లు ఖాళీ ఉండేవి కాదు. కలెక్షన్లు రికార్డు మోత మోగించేవి. కానీ రోబో సినిమా తరవాత రజనీ సినిమాల్లో ఆ మ్యాజిక్ మిస్సయింది. ఆమధ్య భారీ అంచనాల మధ్య వచ్చిన కబాలి సినిమా ప్రేక్షకులను విపరీతంగా నిరాశపరిచింది. కానీ రజనీ కబాలి డైరెక్టర్ పా. రంజిత్ డైరెక్షన్ లోనే కాలా సినిమా చేశాడు.

రజనీ - పా.రంజిత్ కాంబినేషన్ అంతగా అంచనాలు లేకపోవడం వల్ల కాలా సినిమాకు పెద్దగా కలెక్షన్లు రాలేదు. తెలుగుతోపాటు రజనీకి వీరాభిమానులు ఉన్న తమిళంలోనూ  ఇదే పరిస్థితి ఎదురైంది. కాలా సినిమా జూన్ 7 రిలీజైంది. ఈనెల 27వ తేదీ యాభై రోజులు పూర్తవుతాయి. వెంటనే అమెజాన్ ప్రైమ్ లో కాలా చూసే అవకాశం అందుబాటులోకి రానుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఏదీ రాకపోయినా కాలా తెలుగు వెర్షన్ 27న అమెజాన్ లో దర్శనం ఇవ్వనుందని తెలిసింది.

రజనీని తెలుగు ప్రేక్షకులు ఇష్టపడింది ఆయన స్టయిల్ కు.. సినిమాల్లోని ఎంటర్ టెయిన్ మెంట్ కు. కాలాలో ఇవి రెండూ ఏమంత ఆకట్టుకునేలా ఉండవు. ముంబయిలోని అతిపెద్ద స్లమ్ ధారావి బ్యాక్ గ్రౌండ్ గా సాగే ఈ సినిమా కథ చాలా నీరసంగా సాగుతుంది. అలాంటప్పుడు  అమెజాన్ లో అయినా కాలా చూసేందుకు ప్రేక్షకులు ఎంతవరకు ఆసక్తి చూపుతారనేది డౌటే. కాలా తమిళ్ హిందీ వెర్షన్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చేది ఇంకా క్లారిటీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English