దూకుడు తగ్గించి రూట్ మార్చారు

దూకుడు తగ్గించి రూట్ మార్చారు

టాలీవుడ్ పెద్ద ప్రొడ్యూసర్లో ఒకరిగా ఎన్ఆర్ఐ బిజినెస్ మేన్ అనిల్ సుంకరకు గుర్తింపు ఉంది. సినిమాలపై ఇంట్రస్ట్ తో 14 రీల్స్ బ్యానర్ పెట్టి దానిపై భారీ సినిమాలే నిర్మించారు. దూకుడు లెజండ్ లై లాంటి పెద్ద సినిమాలు ఈ బ్యానర్ పైనే తెరకెక్కాయి. దీంతోపాటు ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వచ్చే సినిమాలకు సహ నిర్మాతగా కూడా అనిల్ సుంకర వ్యవహరిస్తారు.

ఎప్పుడూ క్రేజీ ప్రాజెక్టులు నిర్మించడంపైనే దృష్టి పెట్టే ఈయన ఓ సినిమాను అవుట్ రైట్ గా కొనేశారు. క్షణం సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్ హీరోగా తాజాగా నటించిన గూఢచారి మూవీ థియేటరికల్ ఓవర్సీస్ హిందీ రైట్స్ ను రూ. 7 కోట్లిచ్చి అనిల్ సుంకర కొనేశారు. బడ్జెట్ కు వెరవకుండా సినిమా తీసే ఈయన రూటు మార్చి సినిమాలు కొనడం టాలీవుడ్ లో కొందరని ఆశ్చర్య పరిచింది.

తాజాగా నిఖిల్ హీరోగా నటించిన కిర్రాక్ పార్టీ సినిమాకు అనిల్ సుంకర కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. కన్నడలో సూపర్ హిట్టయిన ఈ మూవీ తెలుగులో ఫ్లాప్ గా మిగిలిపోయింది. దీని తరవాత  కొత్త ప్రాజెక్టులేం మొదలెట్టలేదు. భారీ బడ్జెట్ మూవీస్ పక్కనెట్టి ఓ చిన్న సినిమాను కొంటున్నారంటే రూటు మార్చినట్టుగానే ఉంది.