చరణ్‌ ఛలో అమెరికా! దేనికో?

చరణ్‌ ఛలో అమెరికా! దేనికో?

ప్రస్తుతం చల్లని స్విట్జర్‌ల్యాండ్‌ దేశంలో 'ఎవడు' సినిమా పాటల చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు రామ్‌చరణ్‌. మనోడు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో జూన్‌ నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడని టాక్‌. వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్‌, యామీ జాక్సన్‌లు హీరోయిన్లుకాగా, అల్లు అర్జున్‌,  కాజల్‌లు ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా ప్రీమియర్‌ షో ను చరణ్‌ ఎప్పటిలాగా ప్రసాద్‌ ల్యాబ్‌లో కాకుండా, ఏకంగా అమెరికా వెళ్ళి అక్కడ మన తెలుగు ప్రేక్షకులతో చూడాలని ప్లాన్‌  చేస్తున్నాడట. అదేంటి, ఇంత సడన్‌గా ఎన్నారైల మీద అంత మోజు అంటే, దానికో లెక్క ఉంది అంటున్నాడు. ప్రస్తుతం ఓవర్‌సీస్‌ రికార్డులన్నీ మహేష్‌  పేరుమీదే ఉన్నాయి.ఆయన దూకుడు 9 కోట్లు, సీతమ్మవాకిట్లో 10 కోట్లు వసూలు చేసి, అమెరికాలో మహేష్‌కు తిరుగులేదు అని ప్రూవ్‌ చేశాయి.

అందుకు ఇప్పుడు మనోడు స్వయంగా అక్కడ ప్రీమియర్‌షోకు వెళ్ళి, ఓపెనింగ్స్‌ను బాగా పెంచుకోవాలని చూస్తున్నాడట. మొత్తానిక మహేష్‌ రికార్డును టార్గెట్‌ చేశాడు చరణ్‌. చూద్దాం ఏం చేస్తాడో..