ఎన్టీఆర్ కు అతిలోకసుందరి దొరికేసిందా?

ఎన్టీఆర్ కు అతిలోకసుందరి దొరికేసిందా?

తెలుగునాట బయోపిక్ లు బ్రహ్మాండమైన విజయం సాధించగలదని మహానటి సినిమా నిరూపించింది. అలనాటి మేటి నటి సావిత్రి జీవితగాథతో వచ్చిన ఈ మూవీ హీరోయిన్ కీర్తి సురేష్ కు మంచి పేరు.. నిర్మాతలకు బోలెడు లాభాలు తెచ్చిపెట్టింది. మహానటి సినిమాలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న అంశాల్లో కాస్టింగ్ కూడా ఉంది. చిత్రరంగానికి చెందిన అలనాటి గొప్ప వ్యక్తుల పాత్రలను పేరొందిన నటులు చేయడంతో సినిమాకు ఓ నిండుదనం వచ్చింది.  

తాజాగా విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జీవిత గాథతో ఆయన తనయుడు హీరో నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్టీఆర్ సినిమాలోనూ ఇదే రూల్ ఫాలో అయిపోతున్నారు. కథలో భాగంగా వచ్చే సినిమా రాజకీయ రంగాలకు చెందిన వ్యక్తులుగా పాపులర్ నటులు చాలామందే కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ చేస్తోంది. . తాజాగా ఎన్టీఆర్ తో కలిసి వేటగాడు బొబ్బిలిపులి వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన అందాల సుందరి శ్రీదేవి పాత్రకు టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు.

శ్రీదేవి రోల్ మిగతా వాళ్లకన్నా రకుల్ కరెక్ట్ గా సూటవుతుందని డైరెక్టర్ క్రిష్ ఫీలవుతున్నాడట. ఈ క్యారెక్టర్ చేయడానికి రకుల్ కూడా ఓకే చెప్పేసిందని తెలిసింది. ఇది చిన్న పాత్రే అయినా శ్రీదేవి రోల్ కావడంతో కాదనలేక పోయిందట. బ్లాక్ అండ్ వైట్ టైంలో ఎన్టీఆర్ కు సరిజోడుగా నటించిన సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ మరోసారి కనిపించతోందని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English