అదొక్కటే భరించలేనంటున్న మంచు లక్ష్మి

అదొక్కటే భరించలేనంటున్న మంచు లక్ష్మి

మిమిక్రీ ఆర్టిస్టులు ఈతరం హీరోయిన్లలో ఎవరిదైనా గొంతును లేదా మ్యానరిజమ్ ను అనుకరించాలంటే మొదట ప్రస్తావించే పేరు మోహన్ బాబు కూతురు లక్ష్మీప్రసన్నదే. తడబాటన్నది లేకుండా ఎంతటి తెలుగు డైలాగునైనా అనర్గళంగా చెప్పే సత్తా మోహన్ బాబుది. కానీ లక్ష్మీప్రసన్న తెలుగు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆపి ఆపి మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కువ రోజులు యూఎస్ లో ఉండటం వల్ల ఆమె మాటల్లో అమెరికన్ ఇంగ్లిష్ ప్రభావం విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది.

అందుకే లక్ష్మీ ప్రసన్నను అనుకరించే డైలాగులు.. ఫన్నీ వీడియోస్ చాలానే వచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంటాయి. ఇవన్నీ తన దృష్టికి వచ్చాయని.. దీనికి తానేం పెద్దగా ఫీలవనని అంటోంది ఆమె. కానీ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు సెలబ్రిటీల కుటుంబ సభ్యుల పేర్లు చెబుతూ వాళ్లపై బురద చల్లేలా వీడియోలు చేస్తున్నాయని.. వాటిని చూస్తే మాత్రం ఒళ్లు మండిపోతుందని చెబుతోంది. సినిమా ఫీల్డులో ఉన్నందుకు తమపై జోక్స్ వేసినా.. తమ నటన గురించి కామెంట్ చేసినా సర్దుకుపోతామని... మధ్యలో కుటుంబ సభ్యుల ప్రస్తావన తేవాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నిస్తోంది.

ఈమధ్య సినిమాలకు కాస్త గ్యాపిచ్చిన లక్ష్మీ ప్రసన్న చాలా రోజుల తరవాత వెండితెరపై కనిపించబోతోంది. వైఫ్ ఆఫ్ రామ్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో తాజాగా నటించింది. ఈ సినిమా జులై 20న థియేటర్లకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు