బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో మూడో సినిమా

బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో మూడో సినిమా

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతడితో సినిమా చేయడానికి పెద్ద పెద్ద దర్శకులు లైన్లో ఉంటారు. ఒక్క సినిమా అనుభవంతోనే అలాంటి హీరోతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు అట్లీ. ‘రాజా రాణి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అతను.. ఆ తర్వాత విజయ్ హీరోగా ‘తెరి’ సినిమాను రూపొందించాడు. అది బ్లాక్ బస్టర్ అయింది.

ఆ తర్వాత విజయ్ తోనే తన తర్వాతి సినిమా కూడా తీశాడు. అదే.. ‘మెర్శల్’. ఈ చిత్రమూ బ్లాక్ బస్టరే. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధమవుతోంది. ‘మెర్శల్’ తర్వాత విజయ్.. మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదవ్వగానే మళ్లీ అట్లీతో జత కట్టబోతున్నాడట విజయ్. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

పాత కథల్నే రీసైకిల్ చేసి జనరంజకంగా తీర్చిదిద్దడం అట్లీ స్టైల్. అతడి తొలి సినిమా ‘రాజా రాణి’.. ఆ తర్వాత వచ్చిన ‘తెరి’.. ‘మెర్శల్’ అయినా కొత్తగా ఏమీ కనిపించవు. కానీ ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తాయి. ఈ టాలెంటే అట్లీని టాప్ డైరెక్టర్ల లిస్టులో చేర్చింది. మూడు సినిమాలతోనూ భారీ విజయాలందుకున్న అతను.. టాలీవుడ్ స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగులో ఒక సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఐతే ఏదో ఒక రోజు ప్రభాస్ హీరోగా సినిమా మాత్రం తీస్తానని అట్లీ ఇంతకుముందే ప్రకటించాడు. విజయ్‌‌ సినిమా పూర్తయ్యాక ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English