ఆ హీరో ఏది పట్టుకున్నా మట్టే

ఆ హీరో ఏది పట్టుకున్నా మట్టే

ఒక టైమ్‌లో తమిళ, తెలుగు మార్కెట్లలో తిరుగులేదని అనిపించుకున్న సూర్యకి ఇప్పుడు ఏదీ కలిసి రావడం లేదు. అతను ఏది తలపెట్టినా కానీ రివర్స్‌ అవుతోంది. హీరోగా వరుస పరాజయాలు చవిచూస్తోన్న సూర్యకి నిర్మాతగా కూడా చుక్కెదురైంది. తమ్ముడు కార్తీ గత చిత్రం ఖాకీ పెద్ద హిట్‌ అయిందని ఈసారి అతనితో 'చిన్నబాబు' చిత్రాన్ని నిర్మించాడు సూర్య.

రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌, ఫ్యామిలీ డ్రామా కలిసి బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని ఆశిస్తే అది కాస్తా తేడా కొట్టింది. మరీ పాత కాలం సినిమాలా వుందంటూ ప్రేక్షకులు పెదవి విరిచేయడంతో కార్తీ ప్రమోషన్‌ టూర్‌ అంటూ ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. అన్నయ్యకి ఆర్థికంగా నష్టం రాకూడదని కార్తీ తనంతట తానుగా ఈ టూర్‌ చేస్తున్నాడు. అయితే చిన్నబాబుపై ప్రేక్షకులు శీత కన్ను వేసారని తేలిపోయింది.

ఆదివారం వరకు ఒక మోస్తరుగా వచ్చిన వసూళ్లు ఆ తర్వాత బాగా తగ్గుముఖం పట్టాయి. అటు తమిళంలో కూడా ఈ చిత్రం అంతగా ఆడడం లేదు. అన్నీ రివర్స్‌ అవుతున్నాయని సూర్య ఒకింత ఒత్తిడికి కూడా గురవుతున్నాడట. ఇక తన ఆశలన్నీ సెల్వరాఘవన్‌ డైరెక్షన్‌లో చేస్తోన్న ఎన్‌జీకేపైనే వున్నాయి. సంక్రాంతికి విడుదలయ్యే ఈ చిత్రం ఫలితం తేడా అయితే మాత్రం సూర్యకి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English