మరో బయోపిక్‌లో మహేష్‌ హీరోయిన్‌

మరో బయోపిక్‌లో మహేష్‌ హీరోయిన్‌

భరత్‌ అనే నేనుతో తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టిన కైరా అద్వానీకి ఇప్పుడు ఫుల్‌ డిమాండ్‌ వుంది. అప్పుడే మరో స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌తో ఓ సినిమా చేసేస్తోన్న కైరా అటు బాలీవుడ్‌లోను బిజీగానే వుంది. ఎంఎస్‌ ధోని జీవిత కథతో తీసిన చిత్రంలో సాక్షి ధోని పాత్ర పోషించిన కైరాకి ఆ చిత్రంతోనే మంచి పేరొచ్చింది. అందులో చూసిన తర్వాతే భరత్‌ అనే నేనులో మహేష్‌ పక్కన ఆమెని సెలక్ట్‌ చేసుకున్నాడు కొరటాల శివ.

అది రిలీజ్‌ కాకముందే కైరా పాపులర్‌ అయిపోతుందని గ్రహించి వెంటనే మరో సినిమాకి ఒప్పందం చేసుకున్నాడు డి.వి.వి. దానయ్య. కేవలం గ్లామర్‌ పాత్రలే కాకుండా అవసరమైతే సంచలనాత్మకమైన పాత్రల్లోను నటించగలనని 'లస్ట్‌ స్టోరీస్‌'లో నటించి చూపించింది కైరా. ఆ చిత్రంలో ఆమె నటించిన ఒక సెక్స్‌ సన్నివేశం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది. ధోని తర్వాత ఇప్పుడు కైరా మరో బయోపిక్‌లో నటించబోతోంది. పరమ వీర చక్ర గెలుచుకున్న అమర జవాన్‌ విక్రమ్‌ బాత్రా జీవిత కథతో రూపొందే చిత్రంలో హీరోయిన్‌గా ఆమె ఎంపికైంది. సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటించే ఈ చిత్రానికి కరణ్‌ జోహార్‌ నిర్మాత.

ఇటు తెలుగులోనే కాక అటు హిందీలోను పెద్ద సినిమాలు కైవసం చేసుకుంటూ కైరా రెండు చేతులా సంపాదించేస్తోంది. ఇదిలావుంటే భరత్‌ అనే నేను చిత్రానికి పారితోషికం ఎగవేసారనే రూమర్లని ఖండించిన కైరా సదరు నిర్మాత దానయ్యని వెనకేసుకు వచ్చింది. ఆయనతో వరుసగా రెండవ చిత్రం చేస్తున్నానని, మరో చిత్రం కూడా చేయడానికి సిద్ధమని ప్రకటించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు