అన్నీ కలిసొస్తే అరవింద సమేతకి జాక్‌పాటే

అన్నీ కలిసొస్తే అరవింద సమేతకి జాక్‌పాటే

చాలా గ్యాప్‌ తర్వాత ఒక భారీ చిత్రం రిలీజ్‌ అయిన ప్రతిసారీ బాక్సాఫీస్‌ పరంగా చాలా లాభపడింది. ఈసారి ఆ జాక్‌పాట్‌ ఎన్టీఆర్‌ చిత్రం 'అరవింద సమేత'కి తగిలేట్టుంది. వేసవిలో పలు భారీ చిత్రాలు విడుదల కాగా, అటుపై ఇక పెద్ద సినిమాల సందడి తెలుగు సినిమా బాక్సాఫీస్‌ వద్ద పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం అన్నీ లో బడ్జెట్‌ లేదా మీడియం బడ్జెట్‌ సినిమాలే వస్తున్నాయి.

ఆగస్ట్‌, సెప్టెంబర్‌లో కూడా భారీ చిత్రాలేమీ విడుదల కావడం లేదు. దీంతో అక్టోబర్‌ 11న రాబోతున్న అరవింద సమేత చిత్రానికి పెద్ద అడ్వాంటేజ్‌ అవుతుంది. దాదాపు అయిదు నెలల గ్యాప్‌ తర్వాత ఒక భారీ చిత్రం రావడమంటే ఖచ్చితంగా సినీ ప్రియులు ఆవురావురుమంటూ వుంటారు. ఒక మాదిరిగా వున్నా కానీ బాక్సాఫీస్‌ వద్ద సంచలనానికి లోటుండదు.

అజ్ఞాతవాసి పరాభవంతో ఈసారి ఎలాగైనా తిరిగి తన వైభవం తెచ్చుకోవాలనే కృతనిశ్చయంతో త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. అక్టోబర్‌ అనే కాదు... మళ్లీ సంక్రాంతి వరకు కూడా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పెద్ద హీరోల సినిమాలేమీ వుండవు. దీంతో అరవింద సమేత లాంగ్‌ రన్‌కి కూడా ఫుల్‌ స్కోప్‌ వుంది. ఈ అడ్వాంటేజ్‌ని క్యాష్‌ చేసుకుని ఎన్టీఆర్‌ ఈసారి వంద కోట్ల షేర్‌ సాధించేస్తాడని అభిమానులు ఇప్పట్నుంచే ఫిక్స్‌ అయిపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు