దిల్‌ రాజుతో కటీఫ్‌ అయిపోయినట్టే!

దిల్‌ రాజుతో కటీఫ్‌ అయిపోయినట్టే!

దిల్‌ రాజుకీ, హరీష్‌ శంకర్‌కీ చెడిందనే వదంతులు చాలా కాలంగా వినిపిస్తూనే వున్నాయి. సాధారణంగా తనపై వచ్చే పుకార్లకి వెంటనే క్లారిఫికేషన్‌ ఇచ్చేసే అలవాటున్న హరీష్‌ శంకర్‌ ఈ రూమర్స్‌ తన చెవిన పడ్డట్టే వ్యవహరిస్తున్నాడు. నిజంగానే వీరిద్దరి విబేధాలు వచ్చాయని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. దిల్‌ రాజు బ్యానర్లో వరుసగా మూడు చిత్రాలు రూపొందించిన హరీష్‌ నాలుగవ చిత్రం చేయడానికి కూడా చాలా రోజులుగా సన్నాహాలు చేసుకుంటున్నాడు.

'దాగుడు మూతలు' టైటిల్‌తో ఒక మల్టీస్టారర్‌ చేయడానికి ఇద్దరు యువ హీరోలతో మాటా మంతీ కూడా అయిపోయింది. అయితే ఈ చిత్రం సెకండ్‌ హాఫ్‌ విషయంలో దిల్‌ రాజు, హరీష్‌ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయట. ఎంటర్‌టైన్‌మెంట్‌ బేస్డ్‌గా చేయమని దిల్‌ రాజు అడిగితే, ఎమోషనల్‌గా చేస్తానని హరీష్‌ చెప్పాడట. ఈ విషయం మీదే ఇద్దరూ ఒక అభిప్రాయానికి రాలేదని, ఫలితంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నుంచి హరీష్‌ బయటకి వచ్చేసాడని టాక్‌ వినిపిస్తోంది. ఇదే కథని అనిల్‌ సుంకరకి చెప్పాడని తెలిసింది.

రీసెంట్‌గా 14 రీల్స్‌తో సంబంధాలు పూర్తిగా తెంచేసుకున్న అనిల్‌ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై పలు భారీ చిత్రాలకి శ్రీకారం చుడుతున్నాడని, వాటిలో హరీష్‌ సినిమా కూడా వుంటుందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు