జిగేలు రాణి ఫ్రీ షో

జిగేలు రాణి ఫ్రీ షో

పూజ హెగ్డే క్రేజ్‌కి తక్కువేమీ లేదు కానీ లక్కే కలిసి రావడం లేదు. ఇంతవరకు తను హీరోయిన్‌గా నటించిన సినిమా హిట్టనిపించుకోలేదు. అల్లు అర్జున్‌తో చేసిన 'దువ్వాడ జగన్నాధమ్‌' యావరేజ్‌గా ఆడిందంతే. అది కాకుండా తన పేరు మీదున్న హిట్‌ సినిమా రంగస్థలం ఒక్కటే. 'జిగేలు రాణి'గా ఐటెమ్‌ సాంగ్‌లో అదరగొట్టిన పూజ హెగ్డే కథానాయికగా ఒక హిట్‌ సినిమాని ఖాతాలో వేసుకోవడానికి చూస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌తో సాక్ష్యం చిత్రంలో నటించిన పూజకి ఈ చిత్రానికి గాను భారీ పారితోషికమే లభించింది.

మామూలుగా పుచ్చుకునేదానికి డబుల్‌ అడిగినా కానీ నిర్మాత ఓకే అనేసారు. ఈ చిత్రం ట్రెయిలర్లు ప్రామిసింగ్‌గా కనిపిస్తూ వుండడంతో సాక్ష్యంకి హిట్టు కళ వుందనే అంతా నమ్ముతున్నారు. అందుకేనేమో అగ్రిమెంట్‌లో లేకపోయినా కానీ ప్రమోషన్స్‌ కోసం సమయం కేటాయించడానికి పూజ సై అనేసింది. మామూలుగా హీరోయిన్లు ఇలాంటి అదనపు లాభాలు ఇచ్చినపుడు కాస్త లాభం ఆశిస్తుంటారు.

కానీ పూజ మాత్రం దీనికోసం ఎక్స్‌ట్రా పారితోషికం వద్దనే చెప్పిందట. చేతిలో మహేష్‌ ఇరవై అయిదవ చిత్రంతో పాటు ఎన్టీఆర్‌ అరవింద సమేత వుంది కనుక పూజకి ఈ చిత్రం కోసం ఇంత చేయాల్సిన అవసరం లేదు. కానీ దీనిని చిన్నచూపు చూడకుండా తన పెద్ద మనసు చాటుకుని సాక్ష్యం మేకర్స్‌ మన్ననలు అందుకుంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు