అప్సెట్ అవ్వడం ఎందుకు కుమారి?

అప్సెట్ అవ్వడం ఎందుకు కుమారి?

బిగ్ బాస్ సీజన్ - 2 అప్పుడప్పుడు కాస్త ఇంట్రస్టింగ్ గా.. అప్పుడప్పుడు కాస్త నీరసంగా సాగుతోంది. బిగ్ బాస్ హౌస్ నుంచి తాజాగా భాను శ్రీ బయటికొచ్చేసింది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి అడుగుపెట్టేదెవరు అన్నదానిపై అంతటా ఇంట్రస్ట్ ఉంది. బిగ్ బాస్ మొదటి సీజన్ లో నవదీప్ దీక్షాపంత్ లు ఇలా వైల్డ్ కార్డ్ తో అడుగుపెట్టారు.

రెండో సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కాస్త పేరున్న హీరోయిన్ అడుగుపెట్టనుందనే టాక్ ఎప్పటి నుంచో నడుస్తోంది. కుమారి 21ఎఫ్ ఫేమ్ హెబ్బాపటేల్ రేపోమాపో ఎంట్రీ ఇవ్వనుందనే రూమర్ వినిపించింది. దీనిపై హెబ్బా క్లారిటీ ఇచ్చేసింది. తాను బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడం లేదని తేల్చిచెప్పేసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అడుగుపెట్టే వాళ్లలో తన పేరు వినిపిస్తోందని తెలిసి  చాలా అప్సెట్ అయ్యానని అంటోంది. ప్రస్తుతం షూటింగులతో బిజీగా ఉన్నానని టీవీ షోలు చేసే తీరిక లేదని అంటోంది.

బిగ్ బాస్ లో హౌస్ లోకి తాను అడుగుపెట్టడం లేదంటూ హెబ్బా క్లారిటీ ఇవ్వడం వరకు బాగానే ఉన్నా దానికి అప్సెట్ అవాల్సిన అవసరమేంటో అర్ధం కావడం లేదు. బిగ్ బాస్ కు వెళ్లడం.. వెళ్లకపోవడం తనిష్టమే. వెళ్లేవాళ్లలో ఆమె పేరు వినిపించినంత మాత్రాన ఆమెకొచ్చిన నష్టం ఏమీలేదు. అలాంటప్పుడు దానికి అప్సెట్ అవడం ఎందుకు కుమారీ? హెబ్బాకు ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేవని అందరికీ తెలిసిపోతుందనా? లేదంటే బిగ్ బాస్ ఆఫర్లు కేవలం ఖాళీగా ఉన్న హీరోయిన్లకు మాత్రమే వస్తాయని అందరూ అనుకుంటారనా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు