వారాహి వెనక్కి తగ్గింది

వారాహి వెనక్కి తగ్గింది

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడనే గుర్తింపుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సాయి ధరమ్ తేజ్. మంచి ఈజ్ ఉన్న నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. అతడి తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరో అవ్వాలని ఎప్పటి నుంచో ఆశ పడుతున్నాడు. సరైన టైం.. కథ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అవన్నీ సెట్టయినట్టే కనిపిస్తున్నాయి.

ఈమధ్య శ్రీవిష్ణు హీరోగా అప్పట్లో ఒకడుండేవాడు సినిమా వచ్చింది. 1980ల నాటి కథతో వచ్చిన ఈ మూవీ మంచి టాక్ దక్కించుకుంది. దీనిని డైరెక్ట్ చేసిన సాగర్ తన తరవాత సినిమా కోసం ఓ కొత్త సిద్ధం చేశాడు. దీనితోనే వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడని తెలిసింది. రీసెంట్ గా రవితేజతో సినిమా తీసిన ఎన్.ఆర్.ఐ. బిజినెస్ మేన్ రామ్ తాళ్లూరి ఈమూవీని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది.

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తాజాగా విజేత సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వారాహి చలనచిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ మూవీ ప్రొడ్యూస్ చేశారు. అసలు వైష్ణవ్ తేజ్ ను కూడా సాయి కొర్రపాటియే లాంచ్ చేద్దామని ముందు అనుకున్నారట. కానీ విజేత సినిమా బాక్సాఫీస్ ను ఆకట్టుకోలేక పోయింది. వారాహి బ్యానర్ కు భారీ నష్టం తప్పదని తేలిపోయింది. దీంతో వైష్ణవ్ తేజ్ సినిమా విషయంలో ఆయన వెనక్కి తగ్గినట్టు తెలిసింది.

'నేల టిక్కెట్' నిర్మాత రామ్ తాళ్లూరి ఈ లాంచింగ్ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రావడానికి రంగం సిద్ధమైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English