నాన్న కష్టం తీర్చేసిన ఆర్ఎక్స్ 100

నాన్న కష్టం తీర్చేసిన ఆర్ఎక్స్ 100

లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 స్పీడు ఏ మాత్రం తగ్గకండా దూసుకెళ్లిపోతోంది. రూ. 2.5 కోట్లతో తీసిన ఈ సినిమా మొదటి రెండు రోజుల్లోనే పెట్టుబడి మొత్తం వెనక్కి తెచ్చేసింది. పల్లెటూరి కథతో బోల్డ్ గా తీసిన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. దీంతో ఆర్ఎక్స్100 సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది.

ఆర్ఎక్స్100 హిట్ తో ఆ సినిమా హీరో కార్తికేయ తెగ సంతోషపడిపోతున్నాడు. హీరోగా తొలి సినిమాతో హిట్ దక్కించుకోవడం ఎవరికైనా సంతోషమే. కానీ కార్తికేయకు ఇంకో రకంగానూ తెగ ఆనందపడిపోతున్నాడు. ఈ సినిమా ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి స్వయంగా హీరో కార్తికేయ తండ్రి. కార్తికేయ ఇండస్ట్రీకి కొత్త అయినా అతడి తండ్రి అశోక్ రెడ్డికి కాదు. ఇంతకుముందు ఆయన ఇట్లు ప్రేమ అనే ఓ సినిమా చేశారు. దాంతో రూ. 4 .5 కోట్ల వరకు పోగొట్టుకున్నాడని తెలిసింది. ఇప్పుడు ఆ కష్టనష్టాలు మరిచిపోయేలా ఆర్ఎక్స్ 100 కలెక్షన్లు కొల్లగొడుతోంది.

ఆర్ఎక్స్ ఫుల్ రన్ లో రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందని అంచనా. అంటే ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి ఇంతవరకు పోగొట్టుకున్న దానికన్నా ఎక్కువే రాబట్టుకోగలుగుతున్నాడు అన్నమాట.  తండ్రి కష్టం తీర్చేయడం కన్నా కొడుకుకు ఆనందం ఇంకేముంటుంది. అందుకే కార్తికేయ తెగ సంతోషపడిపోతున్నాడు. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు